తెలంగాణలో ఉత్కంఠరేపిన హుజురాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది.. తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరగగా.. టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో నిలిచింది.. ఆ తర్వాత సాధారణ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు అనూహ్యంగా ఓట్లు పోల్ అయ్యాయి.. రౌండ్ రౌండ్‌కి మెజార్టీ పెరిగింది. ప్రతీ రౌండ్‌లోనూ వెయ్యి ఓట్లకు పైగా మెజార్టీలో నిలిచారాయన.. ఫైనల్‌గా చివరి రౌండ్ పూర్తయ్యే సరికి ఈటల రాజేందర్.. తన ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్…
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై 24 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక, ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆది నుంచి అన్నీ తానై నడించారు హరీష్‌రావు.. నోటిఫికేషన్ వెలువడకముందు నుంచి ఆ నియోజకవర్గంలో వరుస పర్యటనలు చేశారు.. కానీ, విజయాన్ని అందుకోలేకపోయారు. ఇక, హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితంపై స్పందించిన…
ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. ఎగ్జిట్ పోల్స్ అంచానాల మేరకు ఈటల విజయం సాధించారు. ఐతే, ఈటలకు ఈ స్థాయిలో మెజార్టీ లభిస్తుందని ఎవరూ ఊహించలేదు. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా విశ్లేషకులు దీనిని అభివర్ణించారు. సీఎం కేసీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసున్నారు. నాలుగు నెలల సుదీర్ఘ ప్రచారంతో హైవోల్టేజీ ఎలక్షన్‌గా మారింది. హుజూరాబాద్‌లో టఫ్ ఫైట్ తప్పదని మొదటి…
తెలంగాణ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలోకి దిగిన ఆయన తిరుగులేని విజయాన్ని సాధించారు.. మొత్తం 22 రౌండ్ల కౌంటింగ్ జరగాల్సి ఉండగా.. 20 రౌండ్‌లోనే ఈటల రాజేందర్ విజయం ఖాయమైపోయింది. ఎందుకంటే.. అప్పటికే ఈటల రాజేందర్ 21 వేలకు పైగా ఓట్ల అధిక్యంలో ఉన్నారు. ఇక లెక్కించాల్సిన ఓట్ల కంటే.. ఈటలకు లభించిన ఆధిక్యమే అధికంగా…
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది.. గత అసెంబ్లీ ఎన్నికల్లో గౌరప్రదమైన ఓట్లు రాగా.. ఈ ఎన్నికల్లో మాత్రం చెప్పుకోదగిన ఓట్లు రాబట్టలేకపోయింది.. అయితే, ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతోంది.. ఉప ఎన్నికల ఫలితాలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారాన్నే రేపుతున్నాయి.. ఆ ఇద్దరు నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. టి.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
ఈటల రాజేందర్ విజయం వైపు దూసుకెళ్తున్నారు.. రౌండ్ రౌండ్‌కి ఆయనకు లీడ్ పెరిగిపోతూనే ఉంది.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పూర్తిగా వెనుకబడిపోగా.. ఓ దశలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య నువ్వా నేనా అనే పరిస్థితి కొనసాగింది.. కొన్ని రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేదర్ ఆధిక్యాన్ని కనబరిస్తే.. మరికొన్ని రౌండ్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఆధిక్యంలోకి వచ్చారు.. కానీ, ఓవర్ ఆల్‌గా మాత్రం.. ఈటల రాజేందర్ లీడ్‌లో కొనసాగుతూనే వచ్చారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల…
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు బీజేపీ శ్రేణుల్లో మరింత జోష్ నింపాయి.. మొదటి నుంచి తమ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయంపై నమ్మకంతో ఉన్నాయి పార్టీ శ్రేణులు.. అంతకు అనుగుణంగా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.. ఇక, రౌండ్ రౌండ్‌కు ఈటల రాజేందర్ లీడ్ పెరిగిపోతూనే ఉంది.. 15 రౌండ్ ముగిసేసరికి ఆయన ఆధిక్యం 11 వేలను క్రాస్ చేసింది.. ఇక, ఈటల రాజేందర్‌కు పట్టున్న ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల ఓట్లను లెక్కించాల్సి ఉండడంతో.. బీజేపీ విజయం…
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భారీ విజయం వైపు దూసుకెళ్తున్నారు మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్… ఇప్పటి వరకు 15 రౌండ్ల ఫలితాలు వెలువడగా.. ఈటల ఆధిక్యం 11 వేలు దాటేసింది.. 15వ రౌండ్‌లోనే ఈటలకు 2,149 ఓట్ల ఆధిక్యం దక్కగా.. మొత్తంగా ఆయనకు ఇప్పటి వరకు వచ్చిన మెజార్టీ 11,583 ఓట్లుగా ఉంది. ఇక, ఈటల విజయానికి తిరుగేలేదని ఆనందాన్సి వ్యక్తం చేస్తున్న బీజేపీ శ్రేణులు.. ఉత్సవాల్లో మునిగిపోయాయి.. 15వ రౌండ్ ముగిసే సరికి..…
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం వైపు దూసుకెళ్తున్నారు.. ఇప్పటి వరకు టీఆర్ఎస్‌కు పట్టుకున్న మండలాల్లో ఓట్ల లెక్కింపు జరిగినా.. ఆధిక్యంలోనే కొనసాగుతూ వచ్చారు ఈటల.. మిగతా మండలాల్లో ఈటలకు అనుకూలమైన ఓటింగే భారీగా ఉందనే అంచనాలున్నాయి.. దీంతో.. ఈటల గెలుపు నల్లేరు మీద నడకే అని అంచనా వేస్తున్నారు. ఇక, ఈటల ఆధిక్యం పెరుగుతున్నా కొద్ది.. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిపోతోంది.. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్…
ఎప్పుడెప్పుడా అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదురుచూసిన హుజురాబాద్ ఉప ఎన్నికకు నేటితో తెరపడనుంది. ఈ రోజు ఉదయం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో ప్రారంభమైన హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల ఆధిక్యంలో ఉన్నారు. అయితే ఎనిమిదో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు ఆధిక్యం వచ్చినా.. తిరిగి తొమ్మిదో రౌండ్ నుంచి ఈటల తన సత్తా చాటుతున్నారు. అయితే తాజాగా పదో రౌండ్లో కూడా ఈటల…