హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది.. గత అసెంబ్లీ ఎన్నికల్లో గౌరప్రదమైన ఓట్లు రాగా.. ఈ ఎన్నికల్లో మాత్రం చెప్పుకోదగిన ఓట్లు రాబట్టలేకపోయింది.. అయితే, ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతోంది.. ఉప ఎన్నికల ఫలితాలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారాన్నే రేపుతున్నాయి.. ఆ ఇద్దరు నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. టి.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్…
హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో దుబాయ్‌లో క్రికెట్ మ్యాచ్ చూసిన కోమటిరెడ్డి ఇలా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటూ కౌంటర్ ఎటాక్ చేశారు మహేష్ కుమార్.. ఇక, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి కనీసం ప్రచారానికి కూడా రాలేదంటూ ఫైర్ అయిన ఆయన.. ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్‌కి టికెట్ ఇచ్చి గౌరవించాం… కానీ, బలి పశువుని చేయలేదన్నారు. మరోవైపు. ఇదో ప్రత్యేకమైన ఎన్నిక… ఈటల రాజేందర్‌ని మైనస్ చేస్తే బీజేపీ ఓటు బ్యాంకు ఎంతో ఆలోచించుకోవాలని సూచించారు. కోమటిరెడ్డి, జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా రేపటి సమావేశంలో చర్చిస్తామని వెల్లడించారు టి.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్.