ఈటల రాజేందర్ విజయం వైపు దూసుకెళ్తున్నారు.. రౌండ్ రౌండ్‌కి ఆయనకు లీడ్ పెరిగిపోతూనే ఉంది.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పూర్తిగా వెనుకబడిపోగా.. ఓ దశలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య నువ్వా నేనా అనే పరిస్థితి కొనసాగింది.. కొన్ని రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేదర్ ఆధిక్యాన్ని కనబరిస్తే.. మరికొన్ని రౌండ్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఆధిక్యంలోకి వచ్చారు.. కానీ, ఓవర్ ఆల్‌గా మాత్రం.. ఈటల రాజేందర్ లీడ్‌లో కొనసాగుతూనే వచ్చారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుండగా.. ఒక్కో రౌండ్లలో సుమారు 9 వేల నుంచి 10 వరకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది.. ఇక, 17వ రౌండ్‌లోనూ దాదాపు 1500 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు ఈటల రాజేందర్.. 17వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 79,785 ఓట్లు రాగా.. టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు 65,167కు ఓట్లు వచ్చాయి.. మొత్తంగా ఈటల 14,618 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.. మరో ఐదు రౌండ్లలో ఫలితం తేలిపోనుండగా.. ఇక, ఈటల రాజేందర్ విజయం ఖాయమని లెక్కలు వేస్తున్నారు. ఇంకా లెక్కించాల్సిన ప్రాంతా ఓట్లు కూడా ఈటలకు బాగా కలిసి వచ్చే ప్రాంతాలే కావునా.. ఎలా చేసినా ఈటల విజయాన్ని ఆపడం కష్టమే అంటున్నారు.