సీఎం కేసీఆర్ ఇప్పటికైనా నేల మీద నడవాలని సూచించారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. హుజురాబాద్ ఎన్నికల కోసం ఎన్నో హామీలు ప్రొసీడింగ్స్ ఇచ్చారు.. హుజురాబాద్ ఎన్నికలు.. దళితుల మీద ప్రేమ, వారి అభివృద్ధి కోసమే ఒక రీసెర్చ్ సెంటర్ లాగా చేసిండ్రు అని దుయ్యబట్టారు.. కేసీఆర్ కి దళితుల ఓట్లు తప్ప వారిమీద ప్రేమతో కాదు అని మండిపడ్డ ఈటల.. ఈరోజు దుఃఖం…
హైదరాబాద్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ బిజీబిజీగా గడిపారు. ముచ్చింతల్ లోని శ్రీరామానుజ సమతా మూర్తి విగ్రహావిష్కరణలో పాల్గొని సందడి చేశారు. అంతకముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ భుజం తట్టి పలకరించారు. ‘క్యా బండీ.. కైసే హై’ అంటూ కుశల ప్రశ్నలు వేశారు. ఆ తర్వాత జితేందర్‌రెడ్డి, కిషన్ రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డిలను కూడా పలకరించారు. మోడీని ఆహ్వానించేందుకు వచ్చారు కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్ రెడ్డి. పర్యటన ముగించుకుని తిరిగి…
కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బదిలీలు అంటూ 317 జీవోను తీసుకువచ్చి ఉద్యోగులను ఆత్మహత్యలు చేసుకునేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఉద్యోగులతో చర్చించకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, నెటివిటీ లేక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు అని పార్టీల నాయకులు చెప్పిన వినకుండా కేసీఆర్ మొండి వైఖరి అవలంభిస్తున్నారని విమర్శించారు. ఈ జీవోతో ఉద్యోగులు ఇబ్బందులకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నర్సంపేట…
సూర్యాపేటలో తెలంగాణ ప్రాంత శిక్షణ తరగతులలో భాగంగా ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవో 124, 2018 లో రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయని, స్థానికత ఆధారంగా 3 సంవత్సరాల్లో బదిలీలు చేయాలని కోరారు. కానీ 3 సంవత్సరాలు ఫామ్ హౌస్, ప్రగతి భవన్ కి పరిమిత అయ్యి, ఉద్యోగ, టీచర్ల సంఘాలతో చర్చలు జరపకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండి కేసీఆర్ ఇప్పుడు పరుగులు పెడుతున్నారని ఆయన…
కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయం పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు ప్రజా ప్రతినిధులు. ఒక్కసారిగా అందరూ నినాదాలు చేస్తూ పోలింగ్ కేంద్రలోకి రావడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అధికార పార్టీ నాయకులను కండువాలు ధరించి, సెల్ ఫోన్ లను అనుమతిస్తున్నారంటూ కార్పొరేటర్ కమల్ జిత్ కౌర్ ఆగ్రహం వ్యక్తం చేసి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. అయితే అనామకులు ఫిర్యాదు చేస్తే మమ్మల్ని అవుతారా అంటూ మంత్రి గంగుల కమలాకర్ అసహనం వ్యక్తం చేసారు. మంత్రి గంగుల మాట్లాడుతూ… చట్టాలను…
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై అసైన్డ్ భూముల అక్రమణ కేసుపై ఈటల జమున మీడియా మాట్లాడారు. చట్టపరంగానే భూములు కొన్నామని ఈటల జమున వివరించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఈటల జమున మాటలపై స్పందిస్తూ.. సర్వే నంబర్ 130 లో పట్టా ల్యాండ్ లేదని వెల్లడించారు. ఈటల జామున కొనుగోలు చేసిన 3 ఎకరాలు చట్ట విరుద్ధమైన పత్రమని ఆయన అన్నారు. అంతేకాకుండా ఆ భూమి పై ఎలాంటి హక్కు లేని రామరావు దగ్గర నుండి…
హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత ఒక్కసారి తెలంగాణాలో రాజకీయ సమీకరణాలు మారాయి. దుబ్బాక ఉప ఎన్నికతో టీఆర్‌ఎస్ అలర్ట్ అయినా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వచ్చేసరికి జరగాల్సిన నష్టం టీఆర్‌ఎస్ జరిగింది. దుబ్బాక ఎన్నికతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు సింహభాగాన గెలిచి మళ్లీ హైదరాబాద్ పీఠంపై గులాబీ జెండాను ఎగరవేశారు. అయితే ఆ తరువాత జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నిక ఈటల రాజేందర్‌తో పోటీ కారణంగా ప్రత్యేకతను సంతరించుకుంది. హుజురాబాద్ లో…
తెలంగాణలో స్థానిక సంస్థల స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీజేపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన కరీంనగర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రెండు ప్రధాన పక్షాలు అభ్యర్థులను నిలబెట్టడం లేదని చెప్పడం జరిగిందని, టీఆర్‌ఎస్ అభ్యర్థులు గా భాను ప్రసాద్, ఎల్ రమణ లు ఉన్నారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నా ఈటల రాజేందర్…
దళితబంధు మాదిరి గిరిజనబంధు అమలు చేయాలి అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఎన్నికల్లో ప్రజలను వంచించటానికి సీఎం కేసీఆర్ దొంగ స్కీంలను తీసుకొచ్చాడు. నవంబర్ 4న దళితబంధు అమలు చేస్తామన్న కేసీఆర్ మాటలు ఒట్టి మాటలు. రిజర్వేషన్లను అడ్డుకుని గిరిజనుల కళ్ళల్లో మట్టికొట్టిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని తెలిపారు. మూడెకరాల భూమి దేవుడెరుగు.. సాగుచేసుకుంటోన్న పోడు భూములను లాక్కుంటున్నాడు. ధరణి పోర్టల్ వలన సొంత భూముల మీద హక్కులు కోల్పోతున్నాం. సమాజంలో అత్యంత…