టీఆర్ఎస్‌కు ఓట్లేమీ తగ్గలేదు.. కుంగేదిలేదు.. పొంగేదిలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై 24 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక, ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆది నుంచి అన్నీ తానై నడించారు హరీష్‌రావు.. నోటిఫికేషన్ వెలువడకముందు నుంచి ఆ నియోజకవర్గంలో వరుస పర్యటనలు చేశారు.. కానీ, విజయాన్ని అందుకోలేకపోయారు. ఇక, హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితంపై స్పందించిన మంత్రి హరీష్‌రావు.. ప్రజాతీర్పును శిరసావహిస్తాం అని వెల్లడించారు..
హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిన ఓటర్లందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు మంత్రి హరీష్‌రావు.. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేమీ తగ్గలేదన్నారు.. అయితే, దేశంలో ఎక్కడలేనివిధంగా హుజురాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీలు కలిసి పనిచేశాయని ఆరోపించారు.. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా చెబుతున్నారన్న ఆయన.. జాతీయ స్థాయిలో కొట్లాడే బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్ర స్థాయిలో కుమ్మక్కు కావడాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని కామెంట్ చేశారు. ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎన్నికలో ఓటమితో కుంగిపోదు.. గెలిచిననాడు పొంగిపోలేదు. ఓడినా.. గెలిచిన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పనిచేస్తుందని స్పష్టం చేశారు హరీష్‌రావు.
Also Read
తాజావార్తలు
-
PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
-
WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
-
Zomato: ఫుడ్ లవర్స్‌కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
-
Ponguleti Srinivas Reddy : రాజీనామా చేయాల్సింది నేనా.. కేసీఆర్నా? పొంగులేటి ఫైర్
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!