తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మారనున్నాడా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత ఒక్కసారి తెలంగాణాలో రాజకీయ సమీకరణాలు మారాయి. దుబ్బాక ఉప ఎన్నికతో టీఆర్‌ఎస్ అలర్ట్ అయినా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వచ్చేసరికి జరగాల్సిన నష్టం టీఆర్‌ఎస్ జరిగింది. దుబ్బాక ఎన్నికతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు సింహభాగాన గెలిచి మళ్లీ హైదరాబాద్ పీఠంపై గులాబీ జెండాను ఎగరవేశారు. అయితే ఆ తరువాత జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నిక ఈటల రాజేందర్‌తో పోటీ కారణంగా ప్రత్యేకతను సంతరించుకుంది.
హుజురాబాద్ లో గెలిచేందుకు అధికార టీఆర్‌ఎస్ పార్టీ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినా ఈటల రాజేందర్‌ను ప్రజలు గెలిపించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక మునుపెన్నడూ చూడనటువంటి ఎన్నికని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే అనుకున్నట్టుగానే ఈటల గెలుపుతో తెలంగాణ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఈటల గెలుపు తరువాత బీజేపీకి సీఎం అభ్యర్థి దొరికారనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా ఈటల రాజేందర్ కూడా అందుకు తగ్గట్టుగానే పావులు కదుపుతున్నారు. ఇదిలా ఉంటే.. బీజేపీ పార్టీలో ముసలం పుట్టిందని.. కొన్ని రోజుల్లో తెలంగాణ బీజేపీ అభ్యర్థిని మారుస్తారంటూ టీఆర్‌ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు.
Also Read
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాటలకు ఈటల రాజేందర్ చెప్తున్న విషయానికి సంబంధం లేకుండా పోయిందని, త్వరలోనే బీజేపీ అధ్యక్షుడిని మారుస్తారంటూ కరీంనగర్ మేయర్ సునీల్ రావు చేసిన వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోస్తున్నాయి. బీజేపీలో బండిపై విముఖతతో ఉన్న కొందరినీ తనవైపు తిప్పుకునేందుకు ఈటల ప్రయత్నిస్తున్నారని వార్తలూ వినిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీలోని ముఖ్యనేతలు, కార్యకర్తలను తనవైపుకు తిప్పుకొని హైకమాండ్ దృష్టిలో పడి తెలంగాణ బీజేపీ అధ్యక్షపీఠాన్ని ఎక్కేందుకు ఈటల వ్యూహం రచిస్తున్నారని టీఆర్‌ఎస్ నేతలు కోడై కూస్తున్నారు. దీనిపై బీజేపీ శ్రేణులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!