ప్రజల ప్రాణాలు, మానాలు, ఆస్తులు రక్షించలేని కేసీఆర్‌కి ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు అని ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న లైంగిక వేధింపుల ఘటనలపై స్పందించిన ఈటల.. ఆర్.కె.పురం డివిజన్‌లోని ఎన్టీఆర్ నగర్‌లో తొమ్మిదేళ్ల అమ్మాయిపై లైంగిక దాడులు జరిగాయి. స్థానిక కార్పొరేటర్ రాధ ధీరజ్ రెడ్డి, నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీరాములు, స్థానిక నాయకులు అందరూ బస్తీని సందర్శించి ప్రజలకు భరోసా ఇచ్చి.. కుటుంబాన్ని…
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీ ఆర్ నగర్ లో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యులను వనస్థలిపురం లోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానిక బిజెపి నాయకులతో కలిసి బిజెపి నాయకులు ఈటెల రాజేందర్ పరామర్శించారు. తెలంగాణ లో ఎన్ని లక్షల సీసీ కెమెరాలు,షీటీమ్స్ ఎన్ని ఉన్నా కానీ మహిళలపై ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయని ప్రశ్నించారు. కేవలం ప్రగల్భాలు పలికే అసమర్థత సీఎం వెంటనే రాజీనామా చేయాలి డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న హత్యచార కేసులను…
జూలై 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేవాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. భేటీ సందర్భంగా తెలంగాణ సంస్కృ తీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రముఖు లకు స్వాగతం పలకాలని రాష్ట్ర శాఖ నిర్ణ యించింది. ఒకరోజు పూర్తిగా తెలంగాణ, ఆంధ్ర వంటకాలతో అతిథులకు ప్రత్యేక ఆతిథ్యం ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే నెల 2, 3 తేదీల్లో ఈ సమావేశాలు జరగ నున్న నోవాటెల్–హెచ్‌ఐసీసీని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్‌చుగ్, సంస్థా గత వ్యవహారాల సహాయ…
తెలంగాణ రాష్ట్రంలో కొంతకాలం నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం vs బీజేపీ వార్ జరుగుతోన్న విషయం తెలిసిందే! కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో పనులన్నీ సవ్యంగా సాగుతున్నాయని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చుతోందని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తుంటే.. అసలు కేంద్రం రాష్ట్రాన్ని కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోవడం లేదంటూ టీఆర్ఎస్ నేతలు వారి వ్యాఖ్యలు ఖండిస్తున్నారు. డప్పు కొట్టుకోవడం తప్పిస్తే, కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రావడం లేదని టీఆర్ఎస్ తిప్పికొడుతోంది. కానీ, బీజేపీ నేతలు…
2018లో కేంద్రంలో చక్రం తిప్పుతా అని వెళ్లిన ముఖ్యమంత్రి బొక్కబోర్ల పడ్డారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పించారు. హనుమకొండ జిల్లాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించి, హనుమకొండ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పరిపాలించడం చేతకాక సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నారని ఎద్దేవ చేశారు. ఎవరు పట్టించుకోకున్నా ఇతర రాష్ట్రాల సీఎంల వద్ద…
మంత్రి మల్లారెడ్డిపై దాడి, వ్యక్తిగత దాడి కాదని.. ప్రభుత్వంపై రైతులకు ఉన్న వ్యతిరేఖత అని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ నేతలు సెటిలర్ల ఓట్ల కోసం ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ను పిలవకున్నా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని విమర్శించారు. ప్రధానికి కనీస గౌరవం ఇవ్వడం లేదని అన్నారు. కేసీఆర్ గెలవలేకనే పీకేను అరువు తెచ్చుకున్నాడని అన్నారు. సీఎం కేసీఆర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ…
రాబోయే కాలంలో తెలంగాణలో ఎగిరేది బీజేపీ జెండానే అని.. కాంగ్రెస్ దీపంలో ఢిల్లీలోనే ఆరిపోయిందని.. తెలంగాణలో వచ్చే అవకాశమే లేదని.. టీఆర్ఎస్ పార్టీని ఎవరూ నమ్మడం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. రాబోయే కాలంలో బీజేపీ ప్రళయం వస్తుందని అన్నారు. అద్వానీ రథయాత్ర చేసి ఆర్టికల్ 370 రద్దు చేయాలని, రామ మందిరం నిర్మించాలని యాత్ర చేశారని.. మోదీ నాయకత్వంలో ఈ రెండు సాధ్యమయ్యాయని అన్నారు. ట్రిపుల్ తలాక్ వ్యతిరేఖంగా బీజేపీ ప్రభుత్వం చట్టాన్ని…
ఉత్తరాది రాష్ట్రాల్లో తన పర్యటనను మొదలుపెట్టినప్పటి నుంచి సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తుతోన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్.. మరోసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మీద మంత్రులకు, ఎమ్మెల్యేలకు విశ్వాసం లేదని.. అసలు ఆయన్ను భరించే శక్తి వారికి లేదని కుండబద్దలు కొట్టారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చాల్సిన అవసరం లేదని, వాళ్ళకు వాళ్ళే కూల్చుకుంటారన్నారు. ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చని.. ఆ భయంతోనే ఢిల్లీ పర్యటనని అర్ధాంతరంగా ముగించుకొని, కేసీఆర్ హైదరాబాద్‌కు తిరిగొచ్చారని ఎద్దేవా చేశారు.…
కష్టం, శ్రమ మనది.. కేసీఆర్‌ది దోపిడీ అని అందరూ గ్రహించాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్… తెలంగాణ ప్రజల సమస్యలు కేసీఆర్ గాలికి వదిలేశారన్న ఆయన.. ఇక్కడ సమస్యలను ఫేస్ చేసే దమ్ములేక ఇతర రాష్ట్రాలకు ఏదో వెలగ పెడతాను అని వెళ్లారంటూ ఎద్దేవా చేశారు. జాతీయ పార్టీ నేతలు ఇక్కడికి వస్తే టూరిస్ట్ లని అన్నారు… తెలంగాణపై నాకున్న ఆరాటం జాతీయ పార్టీలకు ఉంటుందా? అని ప్రశ్నించారు… ఇప్పుడు ఆ ప్రజల్ని నట్టేట ముంచి పంజాబ్,…
సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ పై బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సెటైర్లు పేల్చారు. సీఎం కేసీఆర్ కూట్లో రాయి తీయలేడు కానీ.. ఏట్లో రాయి తీస్తానని ఢిల్లీ వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని ఆయన విమర్శించారు. తెలంగాణలో పెన్షన్లు రెండు మూడు నెలలకు ఒకసారి వస్తున్నాయని… ఉద్యోగాలకు జీతాలు లేవని… మధ్యాహ్న భోజనం వండేవారికి కూడా డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్రం అప్పుల పాలు అవుతుంటే…గతి లేక…