కేసీఆర్ ఇప్పటికైనా నేల మీద నడువు.. ఎన్నికలు లేకుంటే దళిత బంధు ఉండేదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్ ఇప్పటికైనా నేల మీద నడవాలని సూచించారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. హుజురాబాద్ ఎన్నికల కోసం ఎన్నో హామీలు ప్రొసీడింగ్స్ ఇచ్చారు.. హుజురాబాద్ ఎన్నికలు.. దళితుల మీద ప్రేమ, వారి అభివృద్ధి కోసమే ఒక రీసెర్చ్ సెంటర్ లాగా చేసిండ్రు అని దుయ్యబట్టారు.. కేసీఆర్ కి దళితుల ఓట్లు తప్ప వారిమీద ప్రేమతో కాదు అని మండిపడ్డ ఈటల.. ఈరోజు దుఃఖం లేనోడు బర్లను కొన్నట్టు దళితులకు బర్లను అప్పచెప్పారని విమర్శించారు. అసలు, హుజురాబాద్ ఉప ఎన్నికలు లేకుంటే దళిత బంధు ఉండేదే కాదన్న ఆయన.. ఈటల రాజేందర్ రాజీనామాతోటే కేసీఆర్ దిగివచ్చారని వ్యాఖ్యానించారు.
Read Also: సింగరేణి ప్రైవేటీకరణకు బీజేపీ కుట్ర.. నల్లబంగారం యావత్ తెలంగాణకే కొంగుబంగారం..
Also Read
- Telangana High Court: "ఆ పోలీసులను గుర్తించండి".. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
- CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
- CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
ఇక, 2023 వరకు దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే పరిస్థితి లేదన్నారు ఈటల రాజేదర్.. 10 లక్షల స్కీమ్‌లో దళితులకు పూర్తి స్వేచ్చ ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆయన.. దళిత బంధు డబ్బులు ప్రగతి భవన్ నుండి ఇస్తలేవు.. ప్రజల డబ్బులే కదా అని నిలదీశారు.. మరోవైపు కేసీఆర్, ఊరురా బెల్టు షాపులు పెట్టి ఎన్నో కుటుంబాల బతుకులు రోడ్డు మీద పడేస్తున్నాడని మండిపడ్డారు ఈటల.. ఇప్పటి కైనా కేసీఆర్ నేల మీద నడువు అని సూచించిన ఆయన.. డబల్ బెడ్ రూమ్‌లు నిజమైన పేదలకు ఇవ్వాలి.. కానీ, బ్రోకర్లు డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.. ఈటల రాజేందర్ అమాయకుడు కాదు ఉద్యమ బిడ్డ.. కానీ, ఉప ఎన్నికలు అయిన తెల్లవారి నుండి నియోజకవర్గంలో ఒక్క నాయకుడు కనిపిస్తలేడని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, సీఎం కేసీఆర్‌పై ప్రజలకు వ్యతిరేకత మొదలైందన్నారు ఈటల రాజేందర్.
- Tags
- bjp
- cm kcr
- Etela Rajender
- telangana
- TRS
తాజావార్తలు
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!