ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీ ఆర్ నగర్ లో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యులను వనస్థలిపురం లోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానిక బిజెపి నాయకులతో కలిసి బిజెపి నాయకులు ఈటెల రాజేందర్ పరామర్శించారు. తెలంగాణ లో ఎన్ని లక్షల సీసీ కెమెరాలు,షీటీమ్స్ ఎన్ని ఉన్నా కానీ మహిళలపై ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయని ప్రశ్నించారు. కేవలం ప్రగల్భాలు పలికే అసమర్థత సీఎం వెంటనే రాజీనామా చేయాలి డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న హత్యచార కేసులను సిబిఐ తో దర్యాప్తు చేయించాలని ఈటెల కోరారు.
పేరుకు మాత్రమే షి టీమ్స్ పని చేస్తున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్ ప్రతిష్టను మట్టిలో కలిపి, హైదరాబాద్ కు ఉన్న గొప్పతనాన్ని చెరిపేసే పద్ధతిలో.. మైనర్లపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు భయాందోళనలు కలిగిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. అత్యాచారాలు జరిగినా.. కానీ నిందితులను పట్టుకోవడంలో పోలీస్ వ్యవస్థ విఫలం అయింది ఈటల మండిపడ్డారు. ప్రజలు నిందితులను పట్టుకుంటే తప్ప.. పోలీసులు నిందితులను పట్టుకో లేని పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు. ప్రతిష్ఠాత్మకంగా ఉండే పోలీసు వ్యవస్థ రాజుగారు ఏలుబడిలో నికృష్టంగా దిగజారిపోయారని ఎద్దేవ చేశారు ఈటెల రాజేందర్.
కాగా.. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక కేసు కొనసాగుతున్న నగరంలోని ఎల్బీనగర్‌లో తొమ్మిదేండ్ల బాలికపై ఓ ఆటో డ్రైవర్ మూడు రోజులుగా లైంగిక దాడికి పాల్పడం సంచలంగా మారింది. ఎన్టీఆర్ నగర్‌కు చెందిన సలీమ్.. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన పక్కింట్లో ఉన్న మైనర్ బాలికపై గత మూడు రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. విషయాన్ని బాధితురాలు తన తల్లితో చెప్పడంతో ఆమె ఎల్బీనగర్ పోలీసుకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సలీమ్‌ను అరెస్టుచేశారు. అతనిపై కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించారు.
KTR Twitter: మోదీ జీ.. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల భర్తీ ఎక్కడ ?