ఆ నాయకుడు బీజేపీలో కొత్త సంప్రదాయానికి తెర లేపారా? వచ్చే ఎన్నికల్లో పలానా చోటు నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంలో ఆంతర్యం ఏంటి? అధిష్ఠానం చెప్పిందా.. లేక ఆయనే అడ్వాన్స్ అయ్యారా? కాషాయ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? బీజేపీలో ఎంతటి పెద్దవాళ్లయినా సరే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయిస్తుంది. ఆ అధికారం రాష్ట్ర పార్టీ చేతిలో కూడా ఉండదు. అందుకే ఈ విషయంలో బీజేపీ నేతలు ఎవరూ…
బీజేపీ నేత ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కామెంట్స్ పై ఫైర్ అవుతున్నారు టీఆర్ఎస్ నేతలు. శనివారం టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు ఈటెల రాజేందర్. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని..నేను టీఆర్ఎస్ పార్టీలో చేరింది గజ్వేల్ నియోజకవర్గంలోనే అని.. గజ్వేల్ పై ప్రత్యేక దృష్టి పెట్టానని.. బెంగాల్ లో సువేందు అధికారి, మమతా బెనర్జీని ఓడించినట్లే కేసీఆర్ ని ఇక్కడ నుంచి ఓడిస్తానని అని కామెంట్స్ చేశారు. Read…
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ తర్వాత తెలంగాణలో వరస కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు కమలనాథులు. హైదరాబాద్‌లో మీటింగ్స్ ముగిసిన 24 గంటల్లోనే మూడు కమిటీలు ప్రకటించి తమ దూకుడేంటో తెలియజెప్పారు. వీటిల్లో చేరికల కమిటీ పెద్ద చర్చకే దారితీస్తోంది. మొన్నటి వరకు ఆ చేరికల కమిటీకి బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి నేతృత్వం వహించారు. తాజాగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సారథ్యంలో చేరికల కమిటీని సిద్ధం చేసింది ఢిల్లీ నాయకత్వం.…
టీఆర్ఎస్ నేతలు బావిలో కప్పలా ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఎద్దేవ చేసారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నామని జెపీ నడ్డా తెలిపారని అన్నారు. నిన్నటి ప్రధాని సభ గ్రాండ్ సక్సెస్ అయిందని ఈటెల రాజేందర్ హర్షం వ్యక్తం చేసారు. బోనాలకు వచ్చినంత జనాలు రాలేదని రాష్ట్ర మంత్రులు మాట్లాడడం వారి అవివేకం అని మండిపడ్డారు. పార్టీ మీటింగ్ ని బోనాలతో పోల్చడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి అధికారంలోకి…
మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలలోని జమున హ్యాచరిస్ భూముల వ్యవహారం తేల్చేపనిలో అధికారులు ఉన్నారు.. అధికారులతో పలు దఫాలుగా కలెక్టర్ చర్చలు జరిపారు.. ఈ రోజు, రేపు సంబంధిత రైతులకు భూములను పంపిణీ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతియ అధ్యక్షుడు జెపి నడ్డాతో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర ఆదివారం కలిశారు. ఈ మేరకు అమిత్ షా నుంచి పిలుపు రావడంతో ఢిల్లీ వెళ్లిన ఈటల.. కలిసి తెలంగాణ రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, పార్టీ స్థితిగతులను వివరించారు. తెలంగాణ రాష్ట్రం కోసం పలు అంశాలను చర్చించారు. సమావేశం అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న అయన మీడియాతో మాట్లాడారు… తెలంగాణ రాష్ట్రంలో అధికారాని కైవసం చేసుకోవడం…
ఎనిమిదేళ్ల కాలంలో కేంద్రంలో మోదీ నాయకత్వంలోని సంక్షేమ పథకాలు, అభివృద్ధి భేష్ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. మోదీ 8 ఏళ్ల పాలన గురించి మెదక్ లో జరిగిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 కు ముందు కేసీఆర్ ఏం మాట్లాడాడు.. అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేస్తున్నాడో చెప్పాలి అని ప్రశ్నించాడు. కేసీఆర్ మాటలు, చేతలకు పొంతన ఉండదని అన్నారు. కష్టపడితే తెలంగాణలో అధికారం బీజేపీదే అని ఆయన అన్నారు.…
టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. మహబూబ్ నగర్ పర్యటనలో ఉన్న ఆయన కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవటం..బీజేపీ గెలువటం ఖాయమని జోస్యం చెప్పారు. ఒకసారి టీఆర్ఎస్ ఓడిపోతే మళ్లీ గెలిచే అవకాశం లేదని స్పష్టం చేశారు. గోల్ మాల్ చేయాలనుకున్నప్పుడు..ప్రజలను తప్పుదోవ పట్టించాలన్నప్పుడు కేసీఆర్ మీడియా ముందుకు వస్తాడని విమర్శించారు. కేసీఆర్ కు నేను..నా కుటుంబమనే ఆహం పెరిగిందని అన్నారు.…