2018లో కేంద్రంలో చక్రం తిప్పుతా అని వెళ్లిన ముఖ్యమంత్రి బొక్కబోర్ల పడ్డారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పించారు. హనుమకొండ జిల్లాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించి, హనుమకొండ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పరిపాలించడం చేతకాక సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నారని ఎద్దేవ చేశారు. ఎవరు పట్టించుకోకున్నా ఇతర రాష్ట్రాల సీఎంల వద్ద పడిగాపులు కాస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వద్ద అపాయిమెంట్ కోసం సీఎం కేసీఆర్ పడిగాపులు కాయటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
Shahid Kapoor: సూపర్ హీరోలకు చెక్ పెట్టే ‘ది బాయ్స్’!
రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతులను వదిలి.. పక్క రాష్ట్రాల్లో చెక్కులు పంచటం సీఎం కేసీఆర్‌కు తగదన్నారు. ఉద్యోగులకు జీతాలు, సర్పంచ్‌లకు బిల్లులు ఇవ్వలేని అప్పుల కుప్పగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అని దుయ్యబట్టారు. చట్టాలను మార్చి అప్పులు తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రిని కాగ్ తప్పు పట్టిందన్నారు. 3లక్షల29 వేలకోట్లకు లెక్కలు చెప్పాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు.