హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నికల ప్రచారం జోరు గా సాగుతోంది. విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారంలో ముందుకు సాగుతున్నాయి. ఇక నిన్న హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే.. తాజాగా ఈ ఉప ఎన్నికలో ట్విస్ట్ నెలకొంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన వారిలో రాజేందర్ పేరుతో నలుగురు ఉన్నారు. బిజెపి తరఫున ఈటెల రాజేందర్ బరిలో ఉండగా… ఆఖరి రోజున రాజేందర్ పేరుతో…
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఈ ఎన్నికను బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోరు రసవత్తరంగా మారింది. కురుక్షేత్రాన్ని తలపించేలా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. అయితే కాంగ్రెస్ ఈ రేసులో బాగా వెనుకబడినట్లు కన్పిస్తోంది. దీంతో త్రిముఖ పోటీ కాస్తా ద్విముఖ పోటీగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కాంగ్రెస్ ఏ క్షణానైనా పుంజుకునే అవకాశం ఉందని ఆపార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈనెల తొలివారం…
హుజురాబాద్ ఉపఎన్నికలో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. నామినేషన్లకు నేటితో గడువు ముగిసిపోనుంది. చివరి రోజు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇండిపెండెంట్లు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారింది. ఇప్పటివరకు 15 మంది నామినేషన్లు వేశారు. మొదటిరోజు రెండు నామినేషన్లు దాఖలు కాగా… గురువారం 6 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కావడంతో.. ప్రధాన పార్టీల అభ్యర్ధులు నామినేషన్లు…
హుజురాబాద్‌లో బీజేపీ తరఫున ప్రచారానికి జాతీయ నాయకులు వస్తారా.. లేదా? EC ఆంక్షలు చూశాక కమలనాథులు మార్చిన వ్యూహం ఏంటి? అనుకున్నదొక్కటీ.. అయ్యిందొక్కటా? బీజేపీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? బీజేపీ నేతల దూకుడికి ఈసీ ఆంక్షలు బ్రేక్..! ఉపఎన్నిక షెడ్యూల్ రాకమునుపే హుజురాబాద్‌లో ప్రచారం ప్రారంభించింది బీజేపీ. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిశాక.. ప్రచారాన్ని మరో అంకానికి తీసుకెళ్లే పనుల్లో ఉన్నారు కమలనాథులు. రాష్ట్రస్థాయి నాయకులు.. సీనియర్ నేతలు.. పార్టీ కేడర్ ఇప్పటికే నియోజకవర్గంలో మోహరించాయి.…
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ ప్రకటించారు. ఈ జాబితాలో తెలంగాణ నుండి జాతీయ కార్యవర్గం లో కొత్త వారికి చోటు దక్కింది. అంతేకాదు తెలంగాణ నుండి ఎక్కువ మంది కి అవకాశం దక్కింది. జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఏకంగా నలుగురికి చోటు దక్కింది. ప్రత్యేక ఆహ్వానితులుగా మరో ఇద్దరికి అవకాశం దక్కింది. కార్యవర్గ సభ్యులు గా కిషన్ రెడ్డి, గరిక పాటి, జితేందర్ రెడ్డి, వివేక్ వెంకట…
హుజురాబాద్ లో నామినేషన్ ల సందడి నెలకొంది. ఈరోజు నామినేషన్ల సమయం ముగిసే సరికి మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. బిజెపి తరపున ఈటెల జమున పేరుతో నామినేషన్ దాఖలు చేశారు. ఈనెల 8న ఈటెల రాజేందర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. హుజురాబాద్ లో 4వ రోజు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. బిజెపి తరఫున ఈటెల రాజేందర్ సతీమణి జమున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. హుజూరాబాద్ లో ఈటెల జమున ప్రతీసారీ సెంటిమెంట్ గా నామినేషన్…
హుజూరాబాద్ ఉప ఎన్నిక హీట్ రోజురోజుకీ పెరిగిపోతోంది. అధికార, విపక్ష నేతలు పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. మాజీ మంత్రి ఈటలను ఎలాగైనా ఓడించాలని అధికార టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఈటల రాజేందర్ అదేస్థాయిలో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. కేసీఆర్ అహంకారానికి.. హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి పోటీగా అభివర్ణిస్తున్నారు. తాజాగా ఈటల రాజేందర్ కు మద్దతుగా, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి లేఖ రాసారు. హుజూరాబాద్ ఓటరుగా మీకు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే…
కరీంనగర్ : కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఈటల రాజేందర్ లేఖ రాశారంటూ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉప ఎన్నికల నోటిఫికేషన్ ను తొందరగా విడుదల చేసి, దళిత బంధును, రైతు బంధును ఆపేయాలని ఈటల పేర్కొన్నట్లుగా ఓ లేఖ సోషల్ మీడియాలో నిన్నటి నుంచి వైరల్ అవుతోంది. తెలంగాణ రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, కేంద్ర పారామిలటరీ బలగాలతో ఉపఎన్నిక జరిగేలా చూడాలని ఎన్నికల కమిషన్ ను ఈటల రాజేందర్ కోరినట్లుగా ఆ…
హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఖరారు అయిన నేపథ్యం లో కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. హుజురాబాద్ ఆర్డీవో రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉంటారని… హుజురాబాద్ వ్యాక్సినేషన్ జరుగుతుందన్నారు. హుజురాబాద్ లో 70 సింగిల్ వ్యాక్సినేషన్ జరిగింది 50 శాతం సెకండ్ వ్యాక్సినేషన్ జరిగిందని… అక్టోబర్ 30న ఎన్నిక జరుగుతుందని వెల్లడించారు. నవంబర్ 2 న కౌంటింగ్ జరుగుతుందని… సోషల్ డిస్టెన్స్ మాస్క్ తో పాటు కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించారు.…
ఎంతో ఆసక్తిగా చూస్తున్న హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. తాజాగా హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్ ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. అక్టోబర్ 1 న హుజురాబాద్ నోటిఫికేషన్ విడుదల కానుండగా… నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8 వరకు ఉండనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన ఉండనుండగా… నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13 వరకు ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇక…