వాడివేడిగా సాగిన హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి ఈ సాయంత్రంతో తెరపడనుంది. మరి కొన్ని గంటలే ప్రచారానికి సమయం ఉండడంతో.. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు అభ్యర్థులు. ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచార వేడి తారస్థాయికి చేరింది. ఈ ఉపఎన్నికలో గెల్చి, మరోసారి సత్తా చాటాలని టీఆర్ఎస్ భావిస్తుంటే, ఈటల గెలుపుతో ఝలక్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. అయితే, చాపకింద నీరులా హస్తం పార్టీ ప్రచారం సాగుతోంది. మరోవైపు ఎన్నికల ప్రచారానికి తెరపడనుండడంతో.. ఓటర్ను…
హుజురాబాద్‌లో ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న కొద్ది పార్టీలు ప్రచార జోరును పెంచుతున్నాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా మంగళవారం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ తరుణ్ చుగ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన అధికార టీఆర్‌ఎస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూనే బీజేపీ ఈటల గెలిస్తే నియోజకవర్గానికి వచ్చే పనులను వివరించారు. తరుణ్ చుగ్ మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం హుజురాబాద్ ప్రజలను, రాష్ట్ర ప్రజలను అవమానించిందని, కుక్కను పెట్టినా గెలుస్తామని అన్నారన్నారు. ఈ ఎన్నికల్లో…
హుజూరాబాద్ బైపోల్‌కు సమయం దగ్గరపడింది. ప్రచారం కూడా మూడు రోజుల్లో ముగియనుంది. దీంతో మూడు పార్టీలూ ఓట్ల కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. పోటాపోటీ ప్రచారాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. అయితే ఓటర్ల నాడి ఏంటన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణలో ప్రధాన పార్టీలకు సవాల్‌గా మారింది. ఇప్పటికే ఎవరికి వారు జనం మధ్యకు వెళ్లి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సమావేశాలు, రోడ్‌షోలతో హడావిడి చేస్తున్నారు. ఈనెల…
తెలంగాణలో ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న ఏకైక నియోజకవర్గం హుజూరాబాద్. గడిచిన ఐదు నెలలుగా ఈ నియోజకవర్గంలో ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గెలుపు ఎవరి పక్షాన నిలుస్తుందనేది ఉత్కంఠత నెలకొంది. దేశంలో అత్యంత క్లాస్టీ ఉప ఎన్నిక హుజూరాబాద్ నిలుస్తుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పలు రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా పారామిలిటరీ బలగాల విషయంలో హుజూరాబాద్ సరికొత్త రికార్డును క్రియేట్ చేయడం ఆసక్తిని రేపుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో మోహరించిన…
హుజురాబాద్ బీజేపీ ఎన్నికల ప్రచారంలో పార్టీలో గుర్తింపు పొందిన నాయకులు ఎందుకు కనిపించడం లేదు? వారు అలిగారా.. లేక ప్రచారంలో వారి అవసరం లేదని పార్టీ భావించిందా? బీజేపీలో కీలకంగా ఉన్న నాయకులపై జరుగుతున్న చర్చ ఏంటి? హుజురాబాద్ ప్రచారంలో కాషాయ దండు..! హుజురాబాద్ ఎన్నికల ప్రచారం రంజుగా సాగుతుంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాషాయదండు అక్కడికి షిఫ్ట్ అయింది. ముఖ్యనేతలు ఎన్నికల ప్రచారంలో కనిపిస్తున్నారు. చిన్న సభలు.. సమావేశాల్లో పాల్గొని కేడర్‌కు దిశానిర్దేశం…
హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం తారాస్థాయికి పీక్‌కి చేరింది. ఈ నెల 27తో ప్రచార పర్వానికి ఎండ్ కార్డు పడనుంది. ఎంత ప్రచారం చేసినా ఇంకో నాలుగు రోజులే. దీంతో ప్రధాన పార్టీలకు చెందిన ప్రముఖులు నియోజకవర్గంలోని ఐదు మండలాలను సుడిగాలిలా చుట్టేస్తున్నారు. హుజూరాబాద్ పట్టణం మొదలుకుని మారుమూల పల్లెలల వరకు ..వీధి వీధిన ..గల్లీ గల్లీలో ప్రచార హోరు వినిపిస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు రోడ్ షోలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. రెండు చేతులు జోడించి…
సాధారణ ఎన్నికలైనా.. ఉపఎన్నికైనా రోడ్‌షోలు.. బహిరంగ సభలు కామన్. ఈ రెండు లేకుండా సాగుతోంది హుజురాబాద్ బైఎలక్షన్. నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోనూ సభలకు EC నో చెప్పడంతో ప్రత్యామ్నాయాలపై పడ్డాయి పార్టీలు. ఇంతకీ ఎన్నికల సంఘం విధించిన ఆంక్షలపై పార్టీలు హ్యాపీగా ఉన్నాయా.. బాధపడుతున్నాయా? ఆంతరంగిక చర్చల్లో జరుగుతున్న సంభాషణలేంటి? ఈసీ ఆంక్షలపై హుజురాబాద్‌లో చర్చ..! హుజురాబాద్‌లో ఈ నెల 30న పోలింగ్.. 27తో ప్రచారం ముగింపు. ప్రచారానికి మిగిలి ఉన్న ఈ కొద్దిరోజులనే కీలకంగా…
హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార టీఆర్‌ఎస్, బీజేపీ పై మాటల తూటాలు పేల్చారు. క్యాబినెట్‌లో ఉన్న వాళ్లలో ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారో చెప్పాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. కేటీఆర్‌కు ఈ మధ్య కాంగ్రెస్ మీద ప్రేమ ఎక్కువైందన్నారు. భట్టి మంచోడు అంటాడు, మంచోడైన భట్టిని ప్రతిపక్ష హోదా నుంచి ఎందుకు తీసేశాడో సమాధానం చెప్పాలన్నారు. గాంధీ భవన్‌కు గాడ్సే రావడం కాదు టీఆర్ఎస్…
హుజురాబాద్ బైపోల్‌కు సమయం దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీలు ప్రచారంలో స్పీడ్‌ను పెంచాయి. హుజురాబాద్ మండలం సింగాపూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల రాజేందర్ అధికార టీఆర్‌ఎస్ పార్టీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ వి అన్ని అబద్ధాలు, మోసాలేనని అన్నారు. హుజూరాబాద్ లో టీఆర్‌ఎస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు. మీటింగ్‌కి పోవద్దు అని డబ్బులు ఇచ్చే దుర్మార్గ పరిస్థితికి టీఆర్ఎస్ దిగజారిందన్నారు. పిల్లిని రూంలో వేసి కొడితే…