హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా అన్ని పార్టీలు భావించాయి. నేడో రేపో ఉప ఎన్నికలు ఉంటాయని అందరూ ఉత్కంఠగా ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఈసీ బాంబు పేల్చింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల బైపోల్ ఇప్పట్లో లేదని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పడంతో అంతా ఊసురుమంటున్నారు. మరోవైపు ఉప ఎన్నిక వాయిదా ఏ పార్టీకి కలిసి వస్తుంది? ఇంకేవరికీ మైనస్ అవుతుందనే చర్చ తెలంగాణలో జోరుగా సాగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికను…
సీఎం కేసీఆర్ పై ఈటెల జమున ఫైర్ అయ్యారు. ఇవాళ వీణ వంక మండలం దేశాయిపల్లి గ్రామంలో ఈటల జమున ఇంటింటి ప్రచారం చేశారు. ఈసందర్భంగా ఈటెల జమున మాట్లాడుతూ… ఉద్యమాల గడ్డ హుజురాబాద్ అని.. శ్రీకాంత్ చారి, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వారి ప్రాణ త్యాగాల వల్ల తెలంగాణ వచ్చిందన్నారు. ఒక్క కేసీఆర్ కుటుంబం ఉద్యమం చేస్తే తెలంగాణ రాలేదని… తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముగ్గురు ఆంధ్ర ముఖ్యమంత్రులను ఎదురించి ఈటెల కొట్లాడాడని తెలిపారు.…
కరీంనగర్ జిల్లా : హుజురాబాద్ కు డబుల్ దమాకా అని… గెల్లు శ్రీనివాస్ ఎమ్మెల్యే, కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇక హుజురాబాద్ కు డోక లేదని మంత్రి హరీష్ రావు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్, బిజెపికి మధ్యే పోటీ ఉంటుందన్నారు. ఇవాళ హుజురాబాద్ నియోజక వర్గంలో పర్యటించిన ఈ సందర్భంగా మాట్లాడుతూ… రైతు బంధుకు, రైతు ద్రోహులకు మధ్య పోటీ అని తాను అంటున్నానని తెలిపారు. మార్కెట్ యార్డులు రద్దు,…
టీఆర్ఎస్ పార్టీపై ఈటల రాజేందర్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. దమ్ముంటే కెసిఆర్ నా? హరీష్ నా ? ఎవరు నిలబడతారో చెప్పాలని ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. ”మీ పోలీసులని, అధికారులను, మంత్రులను, డబ్బులు ఆపు, కొనుగోళ్లు ఆపి ప్రచారం చెయ్యి నువ్వు గెలిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా. నువ్వు తప్పుకుంటావా? ఆ దమ్ముందా?” అంటూ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శక్తి పైసలతో రాదని.. ప్రజా బలంతో వస్తుందన్నారు. తాను…
హుజురాబాద్ ఉపఎన్నిక మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెలలోనే ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడుతుందని రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇప్పటి వరకు భావించాయి. అయితే కరోనా పరిస్థితుల్లో ఎన్నికను నిర్వహించడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా? నిర్వహిస్తే ఎలాంటి నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుందో చెప్పాలంటా రాజకీయ పార్టీలను సూచనలు, సలహాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. ఇందుకు ఈ నెల 30వ వరకు గడవు విధించింది. దీంతో ఎన్నికల షెడ్యూల్ ఇప్పట్లో వెలువడే…
హుజురాబాద్‌లో కాంగ్రెస్ నుంచి బరిలో దిగేది ఎవరు? బలమైన వ్యక్తి అనుకున్న నేత చేతులు ఎత్తేశారా? పార్టీ గాలం వేసిన వ్యక్తి కారెక్కేశారా? ప్రధానపక్షాలు క్లారిటీతో ప్రచారం చేస్తుంటే.. కాంగ్రెస్ వ్యూహం ఏంటి? అభ్యర్ధిని తేల్చుతుందా.. నాన్చుతుందా? హుజురాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? హుజురాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికకు పార్టీలు సిద్ధం. ప్రచారం హోరెత్తిపోతోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసి బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్ నియోజకవర్గంలోనే తిరుగుతున్నారు. అనేక వడపోతల తర్వాత TRSV అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస…
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు కు ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. నిన్న హరీష్ రావు చేసిన విమర్శలపై అబిడ్స్ లో చర్చకు సిద్దమని..ఎవరిది తప్పు ఐతే వారికి శిక్ష పడుతుందని చురకలు అంటించారు. నా ఆస్తులపై విచారణకు రెడీ అని… సిట్టింగ్ జడ్జితో లేదా సిబిఐ తో విచారణ చేద్దామని సవాల్ విసిరారు. పార్టీలో చేరినపుడు ఇప్పుడు ఉన్న ఆస్తులు లెక్క తెలుద్దామని.. మీ ఆస్తులపై విచారణకు సిద్ధమా? అని ప్రశ్నించారు. తాను అభివృద్ది…
హుజురాబాద్ ఉపఎన్నిక సమరానికి రాజకీయపార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే పనిలో బీజీగా ఉన్నాయి ప్రధాన పార్టీలు. ఉపఎన్నికకు శ్రేణులను రెడీ చేస్తున్నారు నాయకులు. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ నియోజకవర్గంలో ప్రచారం ఊదరగొడుతోంది. మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఇంచార్జ్‌లును నియమించి గ్రౌండ్ వర్క్ చాలారోజుల కిందటే మొదలుపెట్టేసింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఎలాగైనా హుజురాబాద్ నియోజక వర్గంలో గులాబీ జెండా ఎగుర వేసేందుకు సీఎం కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.…
ఉపఎన్నికల షెడ్యుల్ విడుదల కంటే ముందే హుజురాబాద్‌లో సందడి మొదలైంది. రాజకీయ పార్టీలు ప్రచార హోరును పెంచుకుంటూ పోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరి చూపు హుజురాబాద్ ఉపఎన్నికపైనే ఉంది. అక్కడ రాజకీయ పార్టీల నాయకులు చేసే ప్రకటనలు సర్వత్రా చర్చగా మారుతున్నాయి కూడా. పార్టీలు ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ప్రత్యర్ధి పార్టీలు వేసే ఎత్తుగడలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. గెలుపు కోసం అధికార పార్టీ అయితే.. అన్ని వ్యూహాలను రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కౌశిక్ రెడ్డిని…
సీఎం కేసీఆర్ పై మరోసారి ఈటెల రాజేందర్ సంచలన కామెంట్ చేశారు. కెసిఆర్ కు నీతి, జాతి లేదు మానవత్వం లేదని.. అసలు మనిషే కాదని నిప్పులు చెరిగారు. భూ కబ్జా కేసు ఎందుకు పక్కకు పోయింది…తప్పు చేస్తే తనను జైలుకు ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. ఒక్క సారి తింటేనే మరచిపోమని… అలాంటిది ఇన్నాళ్లు కలిసి ఉన్న నన్ను ఇలా చేస్తావా? అంటూ నిలదీశారు. Read Also : ధోనితో రణ్వీర్ సింగ్ ఫుట్ బాల్ మ్యాచ్……