బై పోల్ : నేడు ఈటల రాజేందర్ నామినేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉపఎన్నికలో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. నామినేషన్లకు నేటితో గడువు ముగిసిపోనుంది. చివరి రోజు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇండిపెండెంట్లు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారింది. ఇప్పటివరకు 15 మంది నామినేషన్లు వేశారు. మొదటిరోజు రెండు నామినేషన్లు దాఖలు కాగా… గురువారం 6 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కావడంతో.. ప్రధాన పార్టీల అభ్యర్ధులు నామినేషన్‌లు వేయనున్నారు. ఇవాళ పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ నుంచి పోటీచేస్తున్న ఈటెల రాజేందర్ నామినేషన్ వేయనున్నారు.
నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉపఎన్నిక ఇంచార్జ్ జితేందర్ రెడ్డిలతో పాటు పలువురు నేతలు పాల్గొననున్నారు. గత ఐదు నెలలుగా ప్రచారంలోనే ఉన్నారు ఈటెల. మరోవైపు ఈటెల సతీమణి జమున తరపున ఇప్పటికే కార్యకర్తలు మూడు సెట్ల నామినేషన్ వేశారు. ఈటెల రాజేందర్ తరపున ఒక సెట్ నామినేషన్ వేశారు బిజెపి కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలుమూరి వెంకట్ చివరిరోజు నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ వేసిన వెంటనే ప్రచారం మెదలు పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. నామినేషన్ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్లమెంటరి అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ లతో పాటు పలువురు సీనియర్ నేతలు హాజరుకానున్నారు.
Also Read
- Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
- DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
- Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
- Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
తాజావార్తలు
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
-
Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
-
DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!