హుజురాబాద్‌లో ప్రచారంలో బిజీగా ఉన్న మాజీ మంత్రి ఈటల మంత్రి హరీష్ రావుపై విరుచుకుపడ్డారు. హుజురాబాద్ మందిని మంత్రి హరీష్ రావు తీసుకు పోయి… దావత్, డబ్బులు ఇవ్వాలని… ఇదే పని ఆయనది అని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ మెప్పు పొందాలనే ఇలా మంత్రి హరీష్ రావు చేస్తున్నాడని ఫైర్ అయిన ఈటల..హరీష్ కు కూడా తన గతే పడుతుందన్నారు. హుజూరాబాద్ చైతన్యవంతమైనా గడ్డ అని పేర్కొన్న ఈటల… ప్రాణాన్ని లెక్కచేయకుండా పోరాటం చేసిన గడ్డ…
హుజురాబాద్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. మాజీ మంత్రి ఈటల రాజీనామాతో హుజురాబాద్ లో ఉప ఎన్నికల అనివార్యం అయింది. ఉప ఎన్నిక తేదీ ఖరారు కాకముందే… అన్ని పార్టీలు హుజురాబాద్‌లో పాగ వేశాయి. విస్ర్తుత స్థాయిలో ప్రచారం కూడా చేస్తున్నాయి. ఉద్యమంలో ఉన్న నాయకులకు అన్యాయం జరిగిందనే… సెంటిమెంట్ ను ఈటల రాజేందర్ ప్రజల్లోకి తీసుకు వెళుతున్నారు. అటు టీఆర్‌ఎస్… సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న బీజేపీలోకి ఈటల ఎందుకు వెళ్లారంటూ? ప్రశ్నిస్తోంది. అంతేకాదు.. ఈటలకు రాజకీయంగా…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈటల షాకింగ్ కామెంట్స్ చేశారు. తెరాస లేకుంటే నేను ఎక్కడ అని కొందరు అంటున్నారని.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాకు ఎమ్యెల్యే గా అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ పుణ్యమా అని ఎమ్యెల్యే గా గెలిచినా అని.. మొదటి సారీ గెలవడం ఈజి.. కానీ రెండవ సారీ గెలవడం కష్టమన్నారు. 2023 తరువాత టీఆర్ఎస్ ఓటమి ఖాయమని.. తరువాత వచ్చే ప్రభుత్వంలో వచ్చే స్కీం చాలా…
ఈటెల రాజేందర్ ఎపిసోడ్ తో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఆయన పార్టీకి, ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటలపై టీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. వీటికి ధీటుగా ఈటెల రాజేందర్ కౌంటర్ ఇస్తున్నారు. అయితే తాజాగా ఈటల రాజేందర్ మరోసారి సిఎం కెసిఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. రాచరికాన్ని బొంద పెట్టడం కోసం హుజురాబాద్ ప్రజలు ఎదురు చూస్తున్నారని.. చైతన్య వంతమైన నియోజకవర్గ హుజురాబాద్ అని పేర్కొన్నారు. ఆరు సార్లు ఎన్నికలు వస్తే అన్ని సార్లు…
ఈటల రాజేందర్ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. హుజరాబాద్ ఎన్నిక అభివృద్ధి చేసిన పార్టీకి…అభివృద్ధి చేయని పార్టీలకు మధ్య పోటీ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈటల రాజేందర్ రాజీనామా చేస్తూ మాట్లాడిన మాటలకు అభ్యంతరం చెబుతున్నామని.. ఏది ధర్మం… ఏది అధర్మం అని ఈటలపై మండిపడ్డారు. కేసీఆర్, టిఆర్ఎస్ లేకుంటే ఈటల ఎక్కడ ఉండేవారు ? ఈటలను అనేక విషయాల్లో కేసీఆర్ నమ్మారని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ తనకు తాను తప్పులు…
ఈటల రాజేందర్ రాజీనామాను కాసేపటి క్రితమే తెలంగాణ స్పీకర్ ఆమోదించారు. రాజీనామాని ఆమోదిస్తూ ఫైల్‌పై సంతకం చేశారు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి. ఇవాళ ఉదయం అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్‌పార్క్ లో తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించిన ఈటల.. అనంతరం అసెంబ్లీకి వెళ్లి.. అసెంబ్లీ సెక్రటరీకి తన రాజీనామా లేఖను అందజేశారు.. స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామాలేఖను సమర్పించారు ఈటల రాజేందర్. ఈటల రాజీనామాపై గంట వ్యవధిలోనే స్పందించిన తెలంగాణ స్పీకర్..వెంటనే ఆమోద ముద్ర వేశారు. ఈ…
ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్ గ్రామాలకు చెందిన రైతుల భూములపై మంత్రి ఈటల కబ్జా పెట్టారనే ఆరోపణలు తెలంగాణ రాజకీయాలను కుదిపేశాయి. కబ్జా ఆరోపణలతో ఈటల రాజేందర్ మంత్రి పదవి పోయింది.. దీంతో.. ప్రత్యామ్నాయ రాజకీయ వేదికపై తర్జనభర్జన పడిన టీఆర్ఎస్ సీనియర్ నేత.. అన్ని పార్టీల నేతలతో చర్చలు జరిపారు.. చివరకు భారతీయ జనతా పార్టీ వైపే ఆయన…
తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో వేగంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఈటల దగ్గర ఉన్న వైద్య ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు గవర్నర్ తమిళిసై… దీంతో.. ఏ శాఖలేని మంత్రిగా ఈటల మిగిలిపోయారు.. అయితే, ఈటల నుంచి వైద్య, ఆరోగ్యశాఖ తప్పించాలని గవర్నర్‌కు సీఎం కేసీఆర్ లేఖ రావడంతో.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు గవర్నర్.. ఇక, ఈటలపై భూ కబ్జా ఆరోపణలు రావడంతో.. విచారణకు ఆదేశించిన సంగతి…
తెలంగాణలో ఎన్టీవీ కథనం సంచలం సృష్టించింది.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా బాగోతాలు ఒక్కోక్కటిగా వెలుగు చూస్తున్నాయి.. జమున హ్యాచరీస్ కోసం పేదలను, అధికారులను బెదిరింపులకు గురిచేసి వందల కోట్ల విలువైన భూములను ఆక్రమించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఈటల అనుచరులు తమను బెదరించి భూములు లాక్కొన్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట్ లో ఇది వెలుగు చూడగా.. 130/5, 130/10, 64/6 సర్వే నెంబర్లలో గల భూమిని…