సీఎం కేసీఆర్ పై మరోసారి మాజీ మంత్రి, బీజేపి నేత ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. మిస్టర్ సిఎం కేసీఆర్.. . తెలంగాణ నీ అబ్బ జాగీరు కాదని…నేను ఏం పాపం చేశానని తనపై దాడి చేస్తున్నారని మండి పడ్డారు. ఏం పదవి, ఏం హోదా ఉందని కౌశిక్ రెడ్డి.. తనపై అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని నిప్పులు చెరిగారు. తన రాజీనామా వల్లే కౌశిక్ రెడ్డికి ప్రగతి భవన్ లో ఎంట్రీ దొరికిందని… పదవి కూడ రాబోతుంది… ఈ…
హుజూరాబాద్ ఉప ఎన్నిక వీలైనంత ఆలస్యంగా జరగాలని టీఆర్‌ఎస్ కోరుకుంటోంది. మరోవైపు, దాని ప్రధాన ప్రత్యర్థి బీజేపీ ఈ ఎన్నికలు వీలైనంత తొందరగా జరగాలని కోరుకుంటోంది. అవి ఎందుకు అలా బావిస్తున్నాయనటానికి స్పష్టమైన కారణాలున్నాయి. ఉప ఎన్నిక ఆలస్యమైతే ఉచిత పథకాలు ..స్కీములు ఎక్కువ మంది ఓటర్లకు చేరుతాయి. ఇది టీఆర్‌ఎస్ ఆలోచన. ఈటలకు ఉన్న సింపథీ ఫ్యాక్టర్ చల్లారుతుంది. ఇది బీజేపీ భయం. అలా జరగకముందే వీలైనంత త్వరగా ఎన్నికలు జరిగేలా చూడటానికి బీజేపీ తన…
సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయంటే నేతలకు గుబులు పుడుతుంది. కానీ ఓటర్లకు మాత్రం పండగే. ముఖ్యంగా మందుబాబులకు. నామినేషన్ వేసింది మొదలు పోలింగ్ వరకు తాగినోడికి తాగినంత. రోజంతా మత్తులోనే. ఎవరిని పలకరించినా మాటలు మత్తు మత్తుగా వస్తాయి. ఊళ్లలో మద్యం ఏరులై పారుతుంది. ఉప ఎన్నికలు జరుగుతున్న హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాలేదు. కానీ ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. ఎన్నికలు ఎప్పుడైనా పెట్టనీ అప్పటి వరకు…
నిర్మల్ సభలో బీజేపీ అగ్రనేత అమిత్ షా.. వైరిపక్షాలకు చురకలు వేశారా? తెలంగాణ కమలనాథులు ఆశించింది జరిగిందా? కాషాయ శ్రేణుల్లో ఉత్సాహం నింపారా లేదా? షా పర్యటనపై బీజేపీ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్! అమిత్ షా మాటలు చురుకు పుట్టించాయా? తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్‌లో ఏర్పాటు చేసిన సభకు వచ్చారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ కార్యక్రమానికి భారీగా జనాన్ని సమీకరించేందుకు బీజేపీ నేతలు శ్రమించారు.…
త్వరలోనే హుజురాబాద్ లో ఉప ఎన్నిక జరుగనుంది. ఈటల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా ఈ ఎన్నిక మారింది. దీంతో ఎవరికీవారు తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లురుతున్నారు. ఈటల రాజేందర్ ఈసారి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతుండగా టీఆర్ఎస్ నుంచి యువ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉన్నాడు. కాంగ్రెస్ పోటీలో నిలిచినా అది రెండో, మూడో ప్లేస్ కోసమనే అర్థమవుతోంది. దీంతో పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యేనని స్పష్టమవుతోంది. టీఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నికలు కొత్తేమీకాదు.…
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నిర్మల్ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసిన ఆయన… మజ్లిస్ పార్టీకి భయపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు అమిత్ షా. నిర్మల్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా.. కేసీఆర్‌ను టార్గెట్ చేశారు. అధికారం కారుదే అయినా.. స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమన్నారు.తెలంగాణలో బీజేపీ బలం అంతకంతకూ…
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ శిబిరాన్ని మాత్రం టెన్షన్ పెడుతోందా? హజురాబాద్ ఉపఎన్నికపై పడే ప్రతికూల ప్రభావంపై లెక్కలు వేస్తున్నారా? బీజేపీలో చేరేముందే ఏ అంశంపై అయితే ఈటల స్పష్టత కోరారో.. ఇప్పుడు అదే మళ్లీ చర్చకు వస్తోందా? సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ చూపించే ప్రభావంపై ఈటల వర్గం ఆరా? అదిగో.. ఇదిగో తేదీ ప్రకటించేస్తారని అనుకుంటున్న వేళ హుజురాబాద్ ఉపఎన్నికపై కేంద్ర…
హుజూరాబాద్ బై పోల్…..తెలంగాణలో హైవోల్టేజీ ఎలక్షన్. ఈ నెలలోనే అనుకున్నారంతా. షెడ్యూల్ రేపో మాపో అన్నారు. ఇంకేముంది ..అధికార పార్టీతో సహా అన్ని రాజకీయపక్షాల్లో చెప్పలేనంత హడావుడి. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. భారీ ర్యాలీలు, సభలు.. పంచ్ డైలాగులు. దాంతో పొలిటికల్ హీట్ పీక్ కి చేరింది. కానీ అంతలోనే పెద్ద షాక్. ఎన్నికలు ఇప్పట్లో లేవంటూ ఈసీ అనౌన్స్‌మెంట్. దాంతో నేతల ఉరిమే ఉత్సాహం కాస్తా చల్లబడింది. ఈటల రాజేందర్ వ్యవహారం మొదలై దాదాపు ఐదు నెలలవుతోంది.…
హుజూరాబాద్ ఉప ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నా కొద్దీ నేతల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. అన్ని పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నేతలంతా వీరలెవల్లో ఫార్మామెన్స్ చేసేస్తున్నారు. ఎవరికీ వారు తగ్గెదేలే అన్నట్లుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుండటంతో నేతల మధ్య కుదుర్చుకున్న ఒప్పందాలు సైతం బహిర్గతం అవుతున్నాయి. తాజాగా టీఆర్ఎస్ లో చేరిన నేత కౌశిక్ రెడ్డి.. బీజేపీ నేత ఈటల రాజేందర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేయడం…