హుజురాబాద్ లో నామినేషన్ ల సందడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ లో నామినేషన్ ల సందడి నెలకొంది. ఈరోజు నామినేషన్ల సమయం ముగిసే సరికి మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. బిజెపి తరపున ఈటెల జమున పేరుతో నామినేషన్ దాఖలు చేశారు. ఈనెల 8న ఈటెల రాజేందర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. హుజురాబాద్ లో 4వ రోజు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. బిజెపి తరఫున ఈటెల రాజేందర్ సతీమణి జమున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. హుజూరాబాద్ లో ఈటెల జమున ప్రతీసారీ సెంటిమెంట్ గా నామినేషన్ వేస్తారు. ఆ ఆనవాయితీని కొనసాగించడంతో పాటు ముందు జాగ్రత్తగా కూడా నామినేషన్ వేసినట్టు తెలుస్తోంది.
ఈటెల జమున పేరుతో అరవింద్ అనే వ్యక్తి బిజెపి కార్యకర్త నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి చిలువేరు శ్రీకాంత్ 2 సెట్లు, స్వతంత్ర అభ్యర్థి సైదులు 2 సెట్ల నామినేషన్ల దాఖలు చేశారు. మరో వైపు పెద్ద ఎత్తున నామినేషన్ వేసేందుకు హుజురాబాద్ ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్న ఫీల్డ్ అసిస్టెంట్లుకు నామినేషన్ పత్రాలు ఇవ్వలేదని నిరసన తెలిపారు. కోవిడ్ నిబంధనలు ప్రకారం నిరసన తెలిపేందుకు గుమిగుడారదని, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో 22 మంది ఫిల్డ్ అసిస్టెంట్లను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేయగా ఈటెల రాజేందర్ చివరి రోజు నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇటు కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కూడా రెండ్రోజుల్లో నామినేషన్ దాఖలుచేసే అవకాశం కనిపిస్తుంది. ఈనెల 8న నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది. ఈనెల 6న బతుకమ్మ పండుగ సందర్భంగా సెలవు ఉండనుంది. 11 న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.. 13 న ఉపసంహరణకు అవకాశం కల్పించనున్నారు. అకారణంగా తమను ఉద్యోగాల నుండి తొలిగించారని ఫీల్డ్ అసిస్టెంట్ లు పెద్ద ఎత్తున నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!