మరో వారం రోజుల్లో హుజురాబాద్ ఉపఎన్నిక జరగనుంది. ప్రచారానికి మిగిలింది మరో నాలుగు రోజులే. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు ప్రచారాన్ని స్పీడప్ చేశాయి. ముఖ్య నేతలంతా అక్కడే మకాం వేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ప్రజా నాడి ఎలా ఉందనే దానిపై పరిశీలనలు చేస్తూనే.. ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకెళుతున్నారు. మూడు ప్రధాన పార్టీలు బరిలో నిలిచినా.. పోటీ మాత్రం టీఆర్ఎస్-బీజేపీ మధ్యే ఉంది. హుజురాబాద్ బైపోల్ ఈనెల 30న జరగనుంది. నవంబర్2న రిజల్ట్స్.…
ఈటల రాజేందర్ కు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీ హనుమంతరావు సవాల్ విసిరారు. హుజురాబాద్ ఎన్నికల్లో గెలిస్తే నిత్యావసర ధరలు తగ్గిస్తావా..? పబ్లిక్ సెక్టర్ లను అమ్మేది ఆపుతావా ? అంటూ ఈటలకు చాలెంజ్ విసిరారు వీహెచ్. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ… కెసిఆర్ – ఈటల లొల్లి కారణంగానే ఈ ఉపఎన్నిక వచ్చిందని… రాష్ట్రము లో ఉన్న పది…
హుజురాబాద్ లో ఈటల రాజేందర్ కు పద్మశాలి ఓట్లు అడిగే అర్హత కోల్పోయాడని ఎల్ రమణ ఫైర్ అయ్యారు. హుజూరాబాద్ పట్టణంలో ని టిఆర్ఎస్ కార్యాలయంలో ఎల్ రమణ మాట్లాడుతూ… కేంద్రం లో బిజెపి ప్రభుత్వం వచ్చిన తరువాత చేనేత పరిశ్రమ నిధులు తగ్గించారని.. దేశంలో హ్యాండ్‌లూమ్ బోర్డును బిజెపి రద్దు చేసిందని నిప్పులు చెరిగారు. చేనేత పరిశ్రమ బీమా లు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్ర…
దళిత బంధు నిలుపుదలతో హుజూరాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపి పార్టీల మధ్య వివాదం రాజుకుంది. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల మధ్య పోటా పోటీగా దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు. పోటా పోటీగా నినాదాలుతో పొలిటికల్ హిట్ తారాస్థాయికి చేరింది. పలుచోట్ల దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈటెల దళిత బంధు ఆపడానికి కుట్ర పన్నాడని దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఇక జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామంలో ఏకంగా ఈటల రాజేందర్ దిష్టి బొమ్మ శవయాత్ర నిర్వహించారు. మాచనపల్లి గ్రామంలో TRS…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 20 నుంచి వారం రోజుల పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా సిద్ధమైంది. ప్రజా సంగ్రామ యాత్ర ఇటీవలే పూర్తి చేసుకున్న సంజయ్, ఇప్పటికే ఒకసారి హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఆయన పార్టీ సీనియర్ నేతలతో చర్చించి ప్రచార వ్యూహం రూపొందించారనీ… అందుకు అనుగుణంగా నేతలు ఈటలకు మద్దతుగా ప్రచారం మరింత ఉధృతం చేయనున్నారని పార్టీ వర్గాలు వివరించాయి.…
హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రధాన పార్టీల నేతలంతా హుజూరాబాద్ లో తిష్టవేసి తగ్గెదేలే అన్నట్లుగా ప్రచారం చేస్తూ ఓటర్లు ఆకట్టుకుంటున్నారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఆయా పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రధాన పార్టీలన్నీ ప్రస్తుతం హుజూరాబాద్ నుంచి పక్కచూపులు చూస్తున్నాయి. నేతలంతా హుజూరాబాద్ సరిహద్దు మండలాలపై ఫోకస్ పెడుతుండటంతో ఎన్నికల ప్రచారం ఆసక్తిని రేపుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల…
హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంట్ డౌన్ మొదలైంది. ఆక్టోబర్ 30కి ఇంకో పక్షం రోజులే ఉంది. దాంతో ప్రచారం రోజు రోజుకు ఉదృతమవుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ముఖ్యంగా టీఆర్‌ఎస్, బీజేపీ గెలుపు కోసం విశ్వప్రయత్నం చేస్తున్నాయి. గడగడపకు వెళ్లి ఓటర్లకు తమ వాదన వినిపిస్తున్నారు. ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.అయితే ఓటర్లు చాలా తెలివైన వారు కదా.. అందుకే ఎవరు ఏం చెప్పినా సైలెంట్‌గా తల ఊపు ఊరుకుంటున్నారు. ఎవరు గెలుస్తారని…
తెలంగాణలో జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొనడంతో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. దేశంలో అత్యంత కాస్లీ ఉప ఎన్నికగా హుజూరాబాద్ ఉప ఎన్నిక రికార్డుకు ఎక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇరుపార్టీల మధ్య హోరాహోరీ ఫైట్ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితం చివరి వరకు దోబుచులాట ఆడే అవకాశం ఉండటంతో ఇక్కడి ప్రతీ ఓటు కీలకంగా మారింది. దీంతో నేతలు ఈ అంశంపై…
కరీంనగర్ జిల్లా : జమ్మికుంటలో కవాతు చేయాలని మహిళలు కోరుతున్నారని… తప్పకుండా త్వరలోనే చేస్తామని పేర్కొన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. జమ్మికుంట పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తనకు సపోర్ట్ గా ఉన్న నాయకులను పట్టండని కెసిఆర్ ప్రగతి భవన్ లో ప్లాన్ వేస్తే.. హరీశ్ రావు అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈరోజు ఉన్న నాయకులు రేపు తనతో ఉండడం లేదని…
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో…ప్రచారం వేడెక్కింది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. సభలు, సమావేశాలతో పార్టీలు హోరెత్తిస్తున్నాయ్. ఇంటింటికి వెళ్లి…ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఆసక్తికర విషయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హుజూరాబాద్ ఉపఎన్నికలో 19 నామినేషన్లు తిరస్కరించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక బరిలో 42 మంది అభ్యర్థులు నిలిచారు. ఈటల పేర్లతో ఉన్న ముగ్గురి నామినేషన్లు తిరస్కరించారు. ఈనెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరించారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలో రాజేందర్ పేర్లతో… మొత్తం నలుగురు అభ్యర్థులు…