హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నికల ప్రచారం జోరు గా సాగుతోంది. విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారంలో ముందుకు సాగుతున్నాయి. ఇక నిన్న హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే.. తాజాగా ఈ ఉప ఎన్నికలో ట్విస్ట్ నెలకొంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన వారిలో రాజేందర్ పేరుతో నలుగురు ఉన్నారు. బిజెపి తరఫున ఈటెల రాజేందర్ బరిలో ఉండగా… ఆఖరి రోజున రాజేందర్ పేరుతో మరో ముగ్గురు కూడా నామినేషన్ దాఖలు చేశారు.
వారి ఇంటి పేర్లు కూడా ఈటల మాదిరిగానే “ఈ” అనే అక్షరం తో ప్రారంభం అయ్యాయి. ఈమ్మడి రాజేందర్ (రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా,) ఈసంపల్లి రాజేందర్ (న్యూ ఇండియా పార్టీ), ఇప్పలపల్లి రాజేందర్ (ఆల్ ఇండియా బిసి ఓబిసి పార్టీ) లు నామినేషన్లు సమర్పించారు. దీంతో ఈటల రాజేందర్ శిబిరంలో కొంత అలజడి మొదలైంది. నలుగురు పేర్లు… ఒకే రకంగా ఉండటంతో హుజురాబాద్ ఓటర్లు… కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉందని ఈటల రాజేందర్ సన్నిహితులు అంటున్నారు.