ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ రాష్ట్రంలో భెజ్జీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు హద్మా అలియాస్ సంకు మృతి చెందినట్లు సమాచారం.
మధ్యప్రదేశ్‌లో మావోయిస్టులు-భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు సహా ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. బాలాఘాట్ జిల్లాలోని లోదంగి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ కాల్పులు జరిగాయి. ఈ ముగ్గురి మావోలపై రూ.30లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలాఘాట్ జిల్లాలోని బహేలా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిందని ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఈ…
జమ్ము & కశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్స్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్వారా, కుల్గాం జిల్లాల్లో ఈ ఎన్‌కౌంటర్స్‌ని నిర్వహించారు. మరణించిన ఉగ్రవాదుల్లో ఒకరు పాకిస్తాన్‌కు చెందినవాడని, లష్కరే తోయిబా సంస్థ కోసం పని చేస్తున్నాడని తెలిసింది. కొంతకాలం క్రితం అరెస్ట్ చేసిన షౌకత్ అహ్మద్ షేక్ అనే ఉగ్రవాది ఇచ్చిన సమాచారం ఆధారంగా.. సైన్యంతో కలిపి పోలీసులు కుప్వారా జిల్లా లోలబ్ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఉగ్రవాదుల శిబిరాల్ని గుర్తించి, చుట్టుముట్టారు. ఇది…
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. వరసగా జరుగుతున్న ఎన్ కౌంటర్లలో ఉగ్రవాదులను లేపేస్తున్నాయి భద్రతా బలగాలు. ఇటీవల కాలంలో దాదాపుగా రోజు ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. తాజాగా కాశ్మీర్ లోని బెమీనా ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి బలగాలు. చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులను నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఎన్ కౌంటర్ లో ఒక పోలీసుకు స్వల్పగాయాలయ్యాయి. గతంలో సోపోర్ ఎన్…
కశ్మీర్‌లోని కుల్గాం జిల్లా ఖండిపోరా ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్-ముజాహిదీన్‌కు చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యాడు.నిషేధిత ఉగ్రవాద సంస్థ ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు శనివారం కొనసాగుతున్నాయని కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. గత కొన్ని నెలలుగా కశ్మీర్‌లో సాగుతున్న టెర్రరిస్టు వ్యతిరేక కార్యకలాపాల శ్రేణిలో పలువురు ఉగ్రవాదులు, వారి కమాండర్లు హతమయ్యారు. ఇంటెలిజెన్స్ అందించిన సమాచారం ఆధారంగా జమ్మూకశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా గాలింపు జరిపాయి. మరోవైపు…
జమ్మూ కాశ్మీర్ లో భద్రతా దళాలకు మరో విజయం లభించింది. వరసగా జరుగుతున్న ఎన్ కౌంటర్లలో ముష్కరులను మట్టుబెడుతున్నారు. గత మూడు రోజుల నుంచి వరసగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. తాజాగా శనివారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను హతం చేశారు. దక్షిణ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా బజ్ బెహరా వద్ద ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో సీఆర్ఫీఎస్, కాశ్మర్ పోలీసులు గాలింపులు జరుపుతున్న…
జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా క్రీరి ప్రాంతంలోని నాజీబాత్ వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు పాక్ ఉగ్రవాదులు హతం అయ్యారు. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమచారంలో భద్రతా బలగాలు కార్డర్ సెర్చ్ ను ప్రారంభించాయి. ఇదే సమయంలో ఉగ్రవాదులకు పోలీసులకు మధ్య కాల్పులు జరగడంతో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఎన్ కౌంటర్ లో ఒక పోలీస్ అధికారి కూడా అమరుడయ్యారు. హతమైన ఉగ్రవాదులను జైష్…
కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్ హత్యకు ప్రతీకారం తీర్చుకున్నాయి భద్రతా బలగాలు. గురువారం రాహుల్ భట్ ను తన కార్యాలయంలో కాల్చి చంపిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు శుక్రవారం జరిగిని ఎన్ కౌంటర్ లో లేపేశాయి. ఒక రోజు వ్యవధిలోనే ఉగ్రవాదులను ట్రాక్ చేసి ఎన్ కౌంటర్ లో మట్టుబెట్టారు. గురువారం బుద్గాం జిల్లా చదూరా తాహసీల్ కార్యాలయంలో రాహుల్ భట్ క్లర్క్ గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు టెర్రరిస్టులు కార్యాలయానికి వచ్చి రాహుల్…
జమ్ము కాశ్మీర్ పుల్వామాలో అలజడి రేగింది. భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాది హతం అయ్యాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశాయి భద్రతా బలగాలు. మరికొందరి కోసం గాలింపు ముమ్మరం సాగుతోంది. ఇంకా ఉగ్రవాదులు వున్నారని భద్రతా బలగాలు చెబుతున్నాయి. కాల్పులు ఇంకా కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. పుల్వామాలోని నైనా బట్పోరాలో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్‌ను నిర్వహించాయి. రెండురోజుల క్రితం ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ప్రస్తుతం ఇంకా ఎన్‌కౌంటర్…