ములుగు కర్రిగుట్ట ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ జవాన్‌ను హైదరాబాద్‌కు తరలించారు. ప్రత్యేక ఆర్మీ హెలికాప్టర్‌లో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న జవాన్ మధు. అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు. గ్రేహౌండ్స్ జవాన్ మధును కలిసేందుకు భారీ స్థాయిలో యశోద ఆస్పత్రికి చేరుకుంటున్న పోలీసు అధికారులు.ఇంటలిజెన్స్, గ్రేహౌండ్స్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు ఆస్పత్రికి చేరుకున్నారు. వీరితో పాటు ఐజీ ప్రభాకర్ రావు, ఇంటెలిజెన్స్ ఛీఫ్ అనిల్ కుమార్ జవాన్‌ణ మధు ఆరోగ్య…
ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తోంది. ఛత్తీస్ గడ్ సరిహద్దు భద్రాద్రి కొత్త గూడెం జిల్లా చర్ల మండలం చిన్న చెన్నా పురం సమీపంలోని సుక్మా, బీజాపుర్ జిల్లాల అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. గ్రేహోండ్స్ దళాలకు–మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ ఛత్తీస్ గడ్ సరిహద్దులో ఈ ఘటన జరిగింది. గత కొద్ది రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం…
మహారాష్ట్రలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పోలీసులు జరిపిన ఎనకౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు జవాన్‌లు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మావోయిస్టులు చనిపోయిన విషయాన్ని గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ ధృవీకరించారు. కాగా గడ్చిరోలి జిల్లా ధనిరా తాలూకా గ్యారబట్టి అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. కొత్గుల్-గ్యారబట్టి ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పోలీసులకు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లినట్లు సమాచారం.…
మహారాష్ట్రలో ఎన్ కౌంటర్ జరిగింది. గడ్చిరోలి గ్యార పట్టి అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగిందని సమాచారం. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి.
ఛత్తీస్‌ఘఢ్-.బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. బీజాపూర్ జిల్లాలో ఈ ఎదురు కాల్పులు జరగగా ముగ్గురు మావోయిస్టుల మృతిచెందారు. ఘటనా స్థలం నుంచి ఎస్‌ఎల్‌ఆర్, ఎకె47 రైఫిల్‌లు స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్‌లోని తర్లగూడ తెలంగాణ సరిహద్దు లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి వుంది.
ఢిల్లీలో పాక్ ఉగ్రవాదిని స్పెషల్ సెల్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ దృవపత్రాలతో ఢిల్లీలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో నివశిస్తున్నాడు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందడంతో స్పెషల్ సెల్ అధికారులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. పాక్ ఐఎస్ఐ శిక్షణ ఇచ్చినట్టు విచారణలో తేలింది. ఈ ఉగ్రవాది నుంచి ఏకే 47, పిస్టల్ తో పాటుగా హ్యాండ్ గ్రెనైడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే, జమ్మూకాశ్మీర్‌లోని సోఫియాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో…
తమిళనాడు కాంచీపురం జిల్లా శ్రీపెరంబుదూర్ ప్రాంతంలో చైన్ స్నాచర్ ఎన్ కౌంటర్ ను చేసారు పోలీసులు. అయితే తుపాకీతో కాల్పులు జరిపి స్థానికులను భయాందోళనలకు గురి చేసాడు చైన్ స్నాచర్. శ్రీపెరంబుదూర్‌లోని ఓ టోల్ ప్లాజా వద్ద ఓ 55 ఏళ్ల మహిళ గొలుసును దొంగిలించాడు ఝార్ఘండ్కు చెందిన ముర్తాసా. బాధితురాలి ఆరుపులతో స్థానికులు నిందితుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా కాల్పులకు తెగబడ్డాడు ముర్తాసా. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. వారిపై కూడా ముర్తాసా కాల్పులు…
జమ్మూ అండ్ కాశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయారు ఉగ్రవాదులు.. పూంచ్ సెక్టార్‌లో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.. ఇవాళ ఉదయం పూంచ్ సెక్టార్‌లో జవాన్లు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.. ఓ జూనియర్ కమిషన్డ్ అధికారి సహా నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. టెర్రరిస్టుల కోసం ఆర్మీ, స్థానిక పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పూంచ్ సెక్టార్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు సైనిక బృందం వెళ్లిన సమయంలో ఎదురుకాల్పులుకు తెగబడ్డారు ఉగ్రవాదులు.
కరుగుడట్టిన ఉగ్రవాదిని జమ్మూ కశ్మీరులో ఖతం చేశాయి భద్రతాబలగాలు.. అత్యంత భయానక ఉగ్రవాది అయిన ఇస్మాయిల్ భాయ్ వురపు లంబును… ఇవాళ మట్టుబెట్టింది ఇండియన్ ఆర్మీ… పుల్వామాలోని నాగ్‌బెరన్-తార్సర్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే-ఇ-మహ్మద్ (జెఎమ్) తో అనుబంధంగా ఉన్న అగ్రశ్రేణి పాకిస్థాన్ తీవ్రవాది హతమయ్యాడు. పుల్వామా జిల్లాలోని అవంతిపోరా పట్టణ శివారులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇంకా గుర్తించబడని మరో ఉగ్రవాది కూడా మరణించాడు. ఘటనా స్థలం నుంచి…
పుల్వామాలో ఈ ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు తీవ్రవాదులు హతం అయ్యారు. పుల్వామాలోని జిల్లా ఆసుపత్రి సమీపంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కాసమాచారంతో ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్ కలిసి జాయింట్ ఆపరేషన్‌ను నిర్వహించాయి. ఉగ్రవాదుల కోసం సెర్చ్ చేస్తుండగా పాక్ కు చెందిన లష్కర్ ఉగ్రవాదులు సైన్యంపై కాల్పులు జరిపారు. సైన్యం ఎదురుకాల్పులు జరిపగా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం పుల్వామాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో కర్ఫ్యూను విధించారు. ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్ జవాన్లు…