జమ్మూ కాశ్మీర్ లో భద్రతా దళాలకు మరో విజయం లభించింది. వరసగా జరుగుతున్న ఎన్ కౌంటర్లలో ముష్కరులను మట్టుబెడుతున్నారు. గత మూడు రోజుల నుంచి వరసగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. తాజాగా శనివారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను హతం చేశారు. దక్షిణ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా బజ్ బెహరా వద్ద ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది.
ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో సీఆర్ఫీఎస్, కాశ్మర్ పోలీసులు గాలింపులు జరుపుతున్న క్రమంలో ఉగ్రవాదుల నుంచి కాల్పులు మొదలవ్వడంతో ఎన్ కౌంటర్ ప్రారంభం అయింది. ఈ ఎన్ కౌంటర్ లో నిషేధిత హిజ్బుల్ ముజాహీద్దీన్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. వీరి నుంచి పెద్ద ఎత్తున ఆయధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులను ఇష్పాఖ్ అహ్గనీ, యావర్ అయూబ్ దార్ గా గుర్తించారు పోలీసులు, వీరు కాశ్మీర్ లోని చక్వాంగుండ్, డోగ్రిపోరాలకు చెందిన వారిగా.. గతంలో ఉగ్రవాద నేరాలకు పాల్పడినట్లుగా కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.
గురువారం కూడా శ్రీనగర్, అవంతిపోరా రెండు ఎన్ కౌంటర్లు జరగాయి. దీంట్లో నలుగురు లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులను హతమర్చాయి భద్రతా బలగాలు. కాశ్మీర్ టీవీ నటి అమ్రీన్ భట్ ను ఉగ్రవాదులు హతమార్చిన 24 గంటల్లోపే ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు లేపేశాయి.