కశ్మీర్‌లోని కుల్గాం జిల్లా ఖండిపోరా ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్-ముజాహిదీన్‌కు చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యాడు.నిషేధిత ఉగ్రవాద సంస్థ ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు శనివారం కొనసాగుతున్నాయని కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. గత కొన్ని నెలలుగా కశ్మీర్‌లో సాగుతున్న టెర్రరిస్టు వ్యతిరేక కార్యకలాపాల శ్రేణిలో పలువురు ఉగ్రవాదులు, వారి కమాండర్లు హతమయ్యారు. ఇంటెలిజెన్స్ అందించిన సమాచారం ఆధారంగా జమ్మూకశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా గాలింపు జరిపాయి.
మరోవైపు శుక్రవారం జమ్మూ కశ్మీర్ పోలీసులతో కలిసి భారత సైన్యం చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో బారాముల్లాలో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా త సంబంధం ఉన్న ఇద్దరు క్రియాశీల ఉగ్రవాదులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.