సోమవారం ఉదయం వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ టెన్త్ ఫలితాలలో మరోసారి బాలికలు సత్తా చాటారు. రాష్ట్రవ్యాప్తంగా 2803 పాఠశాలలో విద్యార్థులకు 100% ఉత్తీర్ణత సాధించగా.. రాష్ట్ర వ్యాప్తంగా 17 స్కూల్స్ లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. ఇక్కడ విశేషమేమిటంటే.. ఈ 17 స్కూల్స్ లో 16 స్కూల్స్ ప్రైవేట్ స్కూళ్లు కావడం. ఒక్క ప్రభుత్వ పాఠశాల ఈ లిస్టులో చేరింది. ఇక నేడు ప్రకటించిన ఫలితాలలో..
Also Read: VIrat Kohli Sunil Narine: కోహ్లీ బ్రో.. నరైన్ కు ఏ జోక్ చెప్పావ్.. అంతలా నవ్వేస్తున్నాడు..
ఏలూరుకు చెందిన ఆకుల వెంకట నాగసాయి మనస్వి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 600 మార్కులకు 599 మార్కులు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. దీనితో ఆ అమ్మాయి స్టేట్ టాపర్ గా నిలిచింది. ఆకుల వెంకట నాగ సాయి మనస్వికి కేవలం సెకండ్ లాంగ్వేజ్ హిందీలో మాత్రమే 99 మార్కులు రాగా మిగతా ఐదు సబ్జెక్టులలో 100కి 100 మార్కులు సాధించి స్టేట్ పేపర్ గా నిలిచింది.
Also Read: MI vs RR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై..
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో మనస్వికి పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. ఇలాంటి విద్యార్థులు సమాజానికి ఎంతో అవసరం అంటూ నెట్టిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే పాపం ఆ ఒక్క మార్కు వేసుంటే సరిపోయేది కదా అంటూ కామెంట్ చేస్తున్నారు.