Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బిలియనీర్ ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ట్రంప్ సర్కార్ తీసుకువచ్చిన ‘‘బిగ్, బ్యూటిపుల్ బిల్’’పై ఇరువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ట్రంప్ ఎలాన్ మస్క్‌కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వివాదాస్పద బిల్లుకు ఓటు వేసే రిపబ్లిక్లను శిక్షించడానికి ప్రయత్నిస్తే ‘‘తీవ్ర పరిణామాలు’’ ఎదుర్కోవాల్సి ఉంటుందని శనివారం బెదిరించారు.
Trump New Bill: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘‘బిగ్, బ్యూటీఫుల్ బిల్లు’’ ఆ దేశంలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా, ఈ బిల్లుపై ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించుకున్నారు. అయితే, ఈ బిల్లు ఇప్పుడు భారత్‌కి వచ్చే నిధులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
Epstein Files: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య ఇటీవల తలెత్తిన విభేదాలు సంచలనంగా మారాయి. వీరిద్దరు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ట్రంప్ సర్కార్ తీసుకువచ్చని ‘‘బిగ్ బ్యూటీఫుల్ బిల్’’పై ట్రంప్ తన అసంతృప్తిని తీవ్రస్థాయిలో వ్యక్తం చేశాడు.
Russia: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘‘బిల్లు’’ను మస్క్ తీవ్రంగా వ్యతిరేకించడంతో ఇద్దరి మధ్య గొడవ చర్చనీయాంశంగా మారింది. ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోసుకున్నారు. ఈ నేపథ్యంలో రష్యన్ శాసన సభ్యుడి ఆఫర్ ఒకటి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది.
టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య స్నేహానికి కళ్లెం పడింది. ప్రస్తుతం ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇంతలో అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ అవసరం గురించి మస్క్ ఓ ప్రకటన చేశారు. వాస్తవానికి.. ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక పోల్ నిర్వహించారు. అందులో అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలా వద్దా అని అడిగారు. తాజాగా ఈ పోల్ ఫలితాలను…
ట్రంప్‌కు గతంలో వైట్ హౌస్ సలహాదారుడిగా పని చేసిన స్టీవ్ బెనాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్‌ను ఓ అక్రమ గ్రహాంతరవాసిగా పేర్కొన్నాడు. వెంటనే అతడ్ని దేశం నుంచి బహిష్కరించాలని కోరారు. అంతేకాదు, మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థను సీజ్ చేయాలని యూఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అంతా నిజమే చెప్తానని ఈటల ప్రమాణం.. అన్నీ కేబినెట్ నిర్ణయం మేరకే! కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నేడు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కమిషన్ ముందు బహిరంగ విచారణకు హాజరయ్యారు. ఉదయం శామీర్‌పేట నివాసం నుంచి బీఆర్కే భవన్‌కు చేరుకున్న ఈటలను ఓపెన్ కోర్టులో కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. 20 నిమిషాల పాటు బహిరంగ విచారణలో అంతా నిజమే చెప్తానని ఈటల ప్రమాణం చేశారు.…
Starlink : భారత్ మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీ ఓ విభాగమైన స్టార్‌లింక్‌కు దేశంలో ఇంటర్నెట్ సేవలందించేందుకు కేంద్ర ప్రభుత్వం లైసెన్స్‌ను మంజూరు చేసింది. దీంతో భారత్‌లో కార్యాచరణ ప్రారంభించనున్న మూడో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ ప్రొవైడర్‌గా స్టార్‌లింక్ నిలవనుంది. ఇందుకు సంబంధించి కేంద్ర టెలికం శాఖ (DoT) స్టార్‌లింక్‌కు పాన్-ఇండియా లైసెన్స్ జారీ చేసింది. ఇప్పటికే భారత్‌లో భారతి గ్రూప్‌కు చెందిన “OneWeb”, జియోతో కలిసి పనిచేస్తున్న…
Trump-Musk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుపుకి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆర్థికంగా ఎంత సాయం చేశారో అందరికీ తెలిసింది. అయితే, గెలిచిన తర్వాత ట్రంప్ కి అత్యంత సన్నిహితుడిగా మారిన మస్క్ డోజీ ద్వారా ఖర్చులు తగ్గించేందుకు కీలకంగా పని చేశారు. కానీ, ప్రస్తుతం ట్రంప్ తీసుకొస్తున్న బిగ్ బ్యూటిఫుల్ టాక్స్ బిల్ వీరి మధ్య దోస్తాన్ కి బీటలువార్చింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. గత కొంత కాలంగా ట్రంప్ ప్రభుత్వంపై మస్క్ విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.