చాలా రోజుల తర్వాత టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వైట్‌హౌస్‌లో ప్రత్యక్షమయ్యారు. వైట్‌హౌస్‌లో ట్రంప్ సౌదీ యువరాజుకు ఇచ్చిన ప్రత్యేక విందులో మస్క్ దర్శనమిచ్చారు. అధ్యక్షుడితో వైరం తర్వాత మస్క్ వైట్‌హౌస్‌లో ప్రత్యక్షం కావడంతో వార్త హల్‌చల్ చేస్తోంది.
Elon Musk: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్, టెస్లా వాటాదారులు ఆయనకు రాబోయే పదేళ్ల కాలానికి సుమారు $1 ట్రిలియన్ (ట్రిలియన్ డాలర్ల) జీతభత్యాల ప్యాకేజీని ఆమోదించడంతో మరింత సంపన్నుడుగా మారారు. ఈ భారీ ప్యాకేజీ ఆమోదం సందర్భంగా.. మస్క్ టెక్సాస్‌లోని టెస్లా వార్షిక సమావేశంలో తన కంపెనీ హ్యూమనాయిడ్ రోబోట్ అయిన ‘ఆప్టిమస్’తో కలిసి డాన్స్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. తన కొత్త వేతన ప్యాకేజీ ఆమోదం పొందిన వెంటనే.. మస్క్ ప్రేక్షకులను…
Grokipedia: సాంకేతిక దిగ్గజం ఎలాన్ మస్క్ తన xAI సంస్థ ద్వారా కృత్రిమ మేధస్సు (Artificial Intelligence)తో నడిచే సరికొత్త ‘గ్రోకీపీడియా (Grokipedia) v0.1’ను అధికారికంగా విడుదల చేశారు. ఆన్‌లైన్ సృష్టిలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ, ఇది నేరుగా ప్రపంచ ప్రఖ్యాత వికీపీడియాకు గట్టి పోటీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది. మరి ఈ కొత్త గ్రోకీపీడియా ఫీచర్స్ ఏంటంటే..? ChatGPT Go: యూజర్లకు గుడ్ న్యూస్.. ChatGPT సబ్‌స్క్రిప్షన్ ఏడాది పాటు ఫ్రీ గ్రోకీపీడియా లక్షణాలలో…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చాలా రోజుల తర్వాత పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఇందుకు చార్లీ కిర్క్ సంతాప కార్యక్రమం వేదిక అయిది. ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది చార్లీ కిర్క్‌ను గుర్తు చేసుకుంటూ ఆదివారం స్మారక మెమోరియల్ సర్వీస్ జరిగింది.
Elon Musk: లండన్‌లో టామీ రాబిన్సన్ నేతృత్వంలో జరుగుతున్న ‘‘వలసల వ్యతిరేక’’ ఆందోళనలు మిన్నంటాయి. లక్షకు పైగా ప్రజలు లండన్ వీధుల్లో మార్చ్ చేశారు. ‘‘యునైట్ ది కింగ్‌డమ్’’ ర్యాలీలో ఏకంగా 1,10,000 మంది జనాలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో, ఈ నిరసనలకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మద్దతు పలికారు. వలస వ్యతిరేక ర్యాలీలో వర్చువల్‌గా ప్రసంగిస్తూ , సంచలన వ్యాఖ్యలు చేశారు. యూకేలో పాలన మార్పుకు మస్క్ పిలుపునిచ్చారు.
వైట్‌హౌస్ వేదికగా గురువారం ట్రంప్ టెక్ సీఈవోలందరికీ ప్రత్యేక విందు ఇచ్చారు. దిగ్గజ సీఈవోలందరూ విందుకు హాజరయ్యారు. కానీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హాజరుకాకపోవడంపై అంతర్జాతీయంగా వార్త చక్కర్లు కొట్టింది.
ట్రంప్-ఎలాన్ మస్క్ సంబంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాలు, నీళ్లు కలిసిపోయినట్లుగా 2024 అమెరికా ఎన్నికల సమయంలో కలిసి తిరిగారు. ఇక అధికారంలోకి వచ్చాక.. ఎప్పుడూ ట్రంప్ పక్కనే కనిపిస్తూ ఉండేవారు
Grok Spicy Mode: ఎలాన్ మస్క్‌కు చెందిన x సంస్థ తాజాగా విడుదల చేసిన ‘Grok Imagine’ ఫీచర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ మల్టీమోడల్ టూల్ ద్వారా యూజర్లు టెక్స్ట్ ప్రాంప్ట్‌లను ఉపయోగించి ఇమేజెస్, వీడియోలు సృష్టించవచ్చు. దీనిలో ఇందులో చర్చనీయాంశంగా మారుతుంది “Spicy Mode” అనే ప్రత్యేక సెట్టింగ్. Tragic Incident: గాల్లో ఆగిపోయిన గల్ఫ్ కార్మికుని గుండె.. నేడు కోరుట్లకు మృతదేహం! ఇకపోతే ఈ Grok Imagine ప్రస్తుతం iOS…
Pavel Durov: గణితశాస్త్రం అంటే కేవలం గణాంకాలు కాదు, అది విజ్ఞానాన్ని విశ్లేషించే సామర్థ్యాన్ని పెంపొందించే శక్తిమంతమైన సాధనమని టెలిగ్రామ్ సీఈఓ పావెల్ డురోవ్ (Pavel Durov) వ్యాఖ్యానించారు. విద్యార్థులు ఏ విషయంపై దృష్టిపెట్టాలో చర్చ జరుగుతున్న వేళ.. దురోవ్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అయితే, ఈ విషయంపై ప్రపంచ ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ (Elon Musk) మాత్రం ఆయన అభిప్రాయాన్ని కొంత విభిన్నంగా చూశారు. మరి ఆ విశేషాలేంటో ఓసారి…
Tesla: ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ ‘‘టెస్లా’’ ఈ రోజు దేశంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ముంబైలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో టెస్లా కొత్త షోరూం ఓపెన్ కాబోతోంది. ఈ షోరూంలో చైనా నుంచి దిగుమతి చేసుకున్న మోడల్ Y క్రాస్ఓవర్లను ప్రదర్శించనున్నారు.