Elon Musk: టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల సీఈవో.. ప్రపంచ కుబేరులలో ఒకరైన ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన నుంచి వైదొలిగారు. ఫెడరల్ ప్రభుత్వంలో పునర్ఘటనం, వ్యర్థ వ్యయాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన “Department of Government Efficiency (DOGE)”లో ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన పనిచేశారు. తన అధికారిక పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో మస్క్ బుధవారం X ద్వారా ఈ ప్రకటన చేశారు. ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా నా నిర్ణీత కాలం…
బుధవారం ఉదయం స్పేస్ఎక్స్ తన స్టార్‌షిప్ సూపర్ హెవీ రాకెట్ తొమ్మిదవ టెస్ట్ ఫ్లైట్‌ను ప్రారంభించింది. దక్షిణ టెక్సాస్‌లోని బోకా చికా బీచ్ సమీపంలోని కంపెనీ స్టార్‌బేస్ లాంచ్ సైట్ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ మిషన్ భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ప్రారంభమైంది. ప్రపంచం దృష్టంతా ఈ ప్రయోగంపైనే కేంద్రీకృతమైంది. అయితే రాకెట్ విజయవంతంగా ప్రయోగించారు. కానీ ప్రయోగించిన కొంత సమయం తర్వాత స్టార్‌షిప్ నియంత్రణను కోల్పోయింది. దీని కారణంగా, అది…
X Outage: మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘‘ఎక్స్’’ శనివారం తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొంది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కంటెంట్ పోస్టింగ్‌లో అంతరాయం ఎదురైనట్లు యూజర్లు పేర్కొన్నారు. ఈ అంతరాయంపై డౌన్‌డిటెక్టర్ 2,100 కి పైగా సమస్యలను నివేదించింది. వినియోగదారులు సైన్ ఇన్ చేయడంలో ఇబ్బంది పడటంతో పాటు నేరుగా సందేశాలను అందుకోకపోవడం వంటి వివిధ సమస్యలను ఎదుర్కొన్నారు. అనేక మంది వినియోగదారులు తమ లింక్స్ తెగిపోయినట్లు నివేదించారు. లాగిన్ అవ్వడం, కొత్త పోస్టులు లోడ్ చేయడం వంటి…
Elon Musk: ప్రధాని నరేంద్రమోడీతో బిలయనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మాట్లాడారు. ఈ ఏడాది భారత్‌లోకి టెస్లా ఎంట్రీ ఇస్తున్న తరుణంలో ఇరువురు మాట్లాడుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోడీతో మాట్లాడిన ఒక రోజు తర్వాత ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివర్లో తాను ఇండియాకు వస్తానని, ఈ పర్యటనపై ఎంతో ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడటాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-టెస్లా అధినేత మస్క్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్టుగా కనిపిస్తున్నాయి. 2024 అమెరికా ఎన్నికల సమయంలో ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. అనంతరం అధికారంలోకి వచ్చాక.. మస్క్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
చైనాపై ట్రంప్ విధించిన సుంకాలను టెస్లా అధినేత, ట్రంప్ సలహాదారుడు ఎలోన్ మస్క్ తీవ్రంగా తప్పుపట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మనసు మార్చుకోవాలని ట్రంప్‌ను మస్క్ కోరినట్లు తెలుస్తోంది.
ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా సైట్ ‘ఎక్స్’ను తన సొంత xAI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీకి 33 బిలియన్ డాలర్ల ఆల్ స్టాక్ డీల్‌లో విక్రయించినట్లు మస్క్ బిలియనీర్ ప్రకటించారు. ఎక్స్ఏఐ విలువను 80 బిలియన్ డాలర్లుగా నిర్ధారించారు.
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత, ట్రంప్ సలహాదారుడు ఎలోన్ మస్క్-అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మధ్య పొసగడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య వైర్యం నడుస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇందుకు జేడీ వాన్స్‌కు సంబంధించిన ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో మస్క్ తీరును తీవ్రంగా తప్పుపట్టినట్లుగా కనిపిస్తోంది.
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలోన్ మస్క్‌కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మస్క్ తన వేలికొనపై రెండు స్పూన్లు బ్యాలెన్స్ చేస్తూ చూపించారు. రెండు చెంచాలు కూడా పడకుండా బ్యాలెన్స్ చేస్తూ పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రక్కనే ఉన్నారు.