Elon Musk: ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం.. కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన
- ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం
- కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన
- అమెరికన్ రాజకీయాల్లో సంచలనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య దెబ్బతిన్న సంబంధం మరో వివాదాస్పద మలుపు తిరిగింది. బిలియనీర్, ట్రంప్ సన్నిహితుడు ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటును ప్రకటించారు. గతంలో, వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం పొందితే, అమెరికాలో కొత్త పార్టీ ఏర్పడుతుందని మస్క్ ట్రంప్‌ను హెచ్చరించారు. అమెరికా 249వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చనీయాంశమైన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై సంతకం చేశారు.
Also Read:Off The Record : కాంగ్రెస్ కంచుకోటలో తేడా రాజకీయం..? ఏంటది..?
Also Read
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
దీంతో ఆ బిల్లు చట్ట రూపం దాల్చింది. ఈ పరిణామం అనంతరం పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ ‘అమెరికా పార్టీ’ అనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పార్టీ అమెరికా ప్రజలను వన్ పార్టీ వ్యవస్థ నుంచి విముక్తి చేస్తుందని ఆయన తెలిపారు. మస్క్ ప్రకటన తర్వాత, అమెరికన్ రాజకీయాల్లో సంచలనం క్రియేట్ అయ్యింది.
Also Read:Prabhas: ఫిష్ వెంకట్ కి ప్రభాస్ సాయం.. అసలు ఏం జరుగుతోంది?
మస్క్ X పై కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటును ప్రకటించారు. ఇటీవలి సర్వే ఫలితాలను తన X పోస్ట్‌లో షేర్ చేస్తూ.. ‘ఈ రోజు మీకు మీ స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి అమెరికా పార్టీ ఏర్పడింది’ అని రాసుకొచ్చారు. సర్వేలో ప్రజలు 2:1 నిష్పత్తిలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కోరికను వ్యక్తం చేశారని ఆయన పేర్కొన్నారు. మీరు కొత్త రాజకీయ పార్టీని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీ మీ ముందు ఉంది అని తెలిపారు. తన ప్రకటనలో, మస్క్ ప్రస్తుత రాజకీయ వ్యవస్థను విమర్శిస్తూ, ‘మన దేశాన్ని వ్యర్థం, అవినీతితో దివాలా తీసే విషయానికి వస్తే, మనం ప్రజాస్వామ్యంలో కాదు, ఏకపార్టీ వ్యవస్థలో జీవిస్తున్నాము’ అని అన్నారు.
Also Read:Hyderabad: చెప్పేవి శ్రీరంగనీతులు… దూరేవి దొంగ గుడిసెలు.. దేవుడి చాటున గలీజ్ దందా..?
మీరు కోల్పోయిన స్వేచ్ఛను తిరిగి తీసుకురావడానికి అమెరికా పార్టీ ఏర్పడిందని కూడా ఆయన అన్నారు. ఈ పోల్‌లో 65.4% మంది ‘అవును’ అని ఓటు వేయగా, 34.6% మంది ‘లేదు’ అని తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ బలమైన ప్రజా మద్దతు పార్టీని ప్రారంభించడానికి ప్రేరణగా మస్క్ పేర్కొన్నారు. రెండు ప్రధాన పార్టీలైన రిపబ్లికన్, డెమోక్రటిక్ పట్ల పెరుగుతున్న ప్రజా అసంతృప్తికి ప్రతిస్పందనగా కొత్త పార్టీని ఏర్పాటును ప్రకటించారు.
తాజావార్తలు
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!