జూలై 8న పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికల ముందు రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింస చెలరేగుతోంది. గత నెల నుండి రాష్ట్రంలోని అనేక జిల్లాల నుండి హింస వార్తలు నిరంతరం వస్తూనే ఉన్నాయి. ఈలోగా ఎన్నికల ఔత్సాహికులు జోరందుకున్నారు. ముర్షిదాబాద్‌లో తృణమూల్, సీపీఎం మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా గవర్నర్ కాన్వాయ్‌కు నల్లజెండాలు చూపించారు. ముర్షిదాబాద్ జిల్లా డోమ్‌కోల్‌లో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో హింస చెలరేగింది.
సంజీవని స్కామ్‌పై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. సంజీవని క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ కుంభకోణం వ్యవహారంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని కేంద్ర మంత్రి సవాల్ విసిరారు.
కత్తిపూడి బహిరంగ సభలో ముందస్తు ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలు రావని సీఎం జగన్ కథలు చెప్తున్నాడని.. నవంబర్, డిసెంబర్‌లలోనే ఎన్నికలు జరుగుతాయని పవన్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏడాదిలోపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా బీఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంత రావు సవాల్ విసిరారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొండితనం మూలంగానే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. ఇదే మొండితనం వల్ల మరిన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఓడిపోబోతోందని జోస్యం చెప్పారు.
కర్ణాటకలో కొద్ది రోజుల క్రితం జరిగిన రాష్ర్ట శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రధాన భూమిక ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న డీకే శివకుమార్‌ది. కర్ణాటక గెలుపులో డీకేతోపాటు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య పాత్ర కూడా ఉంది.
Komati Reddy : తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుంచే పోటీచేస్తానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. తాను బరిలోకి దిగితే ప్రజలు తనను కచ్చితంగా గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజస్థాన్ లోని అశోక్ గెహ్లాట్ సర్కార్ మరో సంక్షోభం ఏర్పడింది. ఓవైపు సొంత పార్టీ నేతల మధ్య విభేదాలు, ప్రభుత్వంలోని మంత్రుల తీరుతో గెహ్లాట్ సర్కార్ కు పెద్ద తలనొప్పిగా మారింది. మరి కొద్ది రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి.