CM MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో మతపరమైన ఘర్షణలను సృష్టించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజల్ని ఆయన కన్‌ఫ్యూజ్ చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలే తగిర గుణపాఠం చెబుతారని అన్నారు. దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో సీఎం స్టాలిన్ ఆ వ్యాఖ్యలపై స్పందించారు.
Read also: Rahul Gandhi: మణిపూర్‌లో రాహుల్ గాంధీ కాన్వాయ్‌ను అడ్డగించిన పోలీసులు
దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయాల్సి అవసరం ఉందని ప్రధాని మోదీ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. దానిపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. దేశంలో మతపరమైన ఘర్షణలను సృష్టించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పాట్నాలో జరిగిన విపక్షాల భేటీ తర్వాత ప్రధాని మోదీ భయపడ్డారని.. అందుకే ఆయన కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడినట్లు స్టాలిన్ తెలిపారు. మాజీ సీఎం కరుణానిధి తనను కేవలం ఓ కుమారుడిలా చూడలేదని, ఆయనకు పార్టీ కార్యకర్తలు అంతా కుమారులే అని స్టాలిన్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రయోజనాల కోసం యూనిఫాం సివిల్ కోడ్ (యుసిసి) అంశాన్ని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాని మోదీ మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రధాని ఏకరీతి సివిల్ కోడ్ అమలు చేస్తామని చెప్పారు మరియు మన దేశంలో రెండు చట్టాలు ఉండకూడదని అన్నారు. దీంతో మత ఘర్షణలను పెంచి ప్రజలను గందరగోళానికి గురి చేసి ఎన్నికలల్లో గెలవాలని చూస్తున్నాడని విమర్శించారు. చివరకు ప్రజలు గెలుస్తారని తాను అనుకుంటున్నానని స్టాలిన్ చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Read also: గ్లామర్ డోస్ పెంచిన గాలోడు హీరోయిన్
ఒకే విధమైన పౌర చట్టాన్ని సమర్థిస్తున్నందుకు ప్రధాని మోదీని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పుడు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ప్రధానిపై ఫైర్ అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్, శివసేన (యుబిటి), ఎఐఎంఐఎం మరియు జెడి(యు) వంటి పార్టీలు ద్రవ్యోల్బణం మరియు నిరుద్యోగం వంటి ఒత్తిడితో కూడిన సమస్యల నుండి దృష్టిని మరల్చడానికి యుసిసి అంశాన్ని ప్రధాని లేవనెత్తారని ఆరోపించిన విషయం తెలిసిందే. భోపాల్‌లో ర్యాలీ ప్రధాని మాట్లాడుతూ దేశంలో ఒకే వ్యక్తుల కోసం వేర్వేరు చట్టాలు ఉండకూడదని ప్రధాని నరేంద్ర మోదీ యూసీసీ అమలును సమర్థించిన విషయం తెలిసిందే. వివిధ చట్టాలతో దేశం ఎలా నడుస్తుంది? యూనిఫాం సివిల్ కోడ్ పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారు. రెండు రకాల చట్టాలు దేశాన్ని నడపలేవు. భారత రాజ్యాంగం కూడా పౌరులకు సమాన హక్కుల గురించి మాట్లాడుతుందని ఆయన అన్నారు.