హై-వోల్టేజ్ ప్రచారాల తర్వాత, రెండు కీలక ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్‌లలో ఎన్నికల పోరు తుదిదశకు చేరుకుంది. ఎందుకంటే ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని సోమవారం నిర్ణయిస్తారు.
PM Narendra Modi: కాంగ్రెస్ ఈశాన్య రాష్ట్రాలను ఏటీఎంగా ఉపయోగించుకుందని విమర్శించారు ప్రధాని నరేంద్రమోదీ. శుక్రవారం ఆయన నాగాలాండ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ మాత్రం 8 ఈశాన్య రాష్ట్రాలను ‘‘ అష్ట లక్ష్మీ’’లుగా భావిస్తోందని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి, అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు. దిమాపూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
భారతీయ మీడియా సంస్థల్లాగా అంతర్జాతీయ మీడియాను నోరు మూయించ లేరని, వాటిని కొనుగో చేయలేరని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీ తీసినందుకే ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు.
ముంబైలోని వర్లీ అసెంబ్లీ స్థానంలో ధైర్యం ఉంటే తనపై ఎన్నికల్లో పోటీ చేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకి శివసేన (ఉద్ధవ్ బాల్ థాక్రే) నాయకుడు ఆదిత్య థాకరే సవాల్ విసిరారు.