Pawan Kalyan: కత్తిపూడి బహిరంగ సభలో ముందస్తు ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలు రావని సీఎం జగన్ కథలు చెప్తున్నాడని.. నవంబర్, డిసెంబర్‌లలోనే ఎన్నికలు జరుగుతాయని పవన్ తెలిపారు. దీనికి సంబంధించి ఎన్నికల కమీషన్‌తోనూ జగన్ మాట్లాడుకుంటున్నారు.. అంతేకాకుండా ప్రిపేర్ అవుతున్నాడని జనసేనాని ఆరోపించారు. తాను బీజేపీతో ఉన్న ముస్లింలపై చేయి పడితే కోరునని చెప్పానని.. ఒక దళితుడుని చంపి ఇంటికి తీసుకుని వెళ్తే వైసీపీ నాయకుడుని ఏమి చేశారని పవన్ ప్రశ్నించారు. అంతే కాకుండా సెక్షన్ 30 పెట్టి మమ్మల్ని ఎవడు ఆపేదన్నారు జనసేనాని. తాము వచ్చిన తర్వాత వైసిపి నాయకులు తాట తీస్తానని హెచ్చరించారు.
Read Also: Government Jobs : BDL లో ఉద్యోగాలు..రాత పరీక్ష లేకుండానే ఎంపిక.. రూ.39,000 జీతం..
మరోవైపు రాష్ట్ర ప్రజలు భవిషత్తు గోదావరి జిల్లాల ప్రజల పై ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. నన్ను గెలిపించండి…అసెంబ్లీకి పంపండని కోరారు. సొంత చిన్నాన్న రక్తం అంటుకున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలా అని ప్రశ్నించారు.
కేంద్రంతో భయపడే వ్యక్తిని కాదు.. ఏపీ ప్రయోజనాలు దెబ్బ తింటున్నాయంటే ఒప్పుకునే వ్యక్తిని కాదని పవన్ అన్నారు. నేను అన్నింటికీ తెగించి వచ్చానని పరోక్షంగా సీఎం జగన్ ను హెచ్చరించారు. మరోవైపు అటు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి పై పవన్ మండిపడ్డారు. కాకినాడ ఎమ్మెల్యే గతంలో తాగి తనను తిట్టాడని తెలిపారు. కాకినాడకి వెళ్లిన తర్వాత ఆ ఎమ్మెల్యే సంగతి చూద్దాం.. కాకినాడలోనే తేల్చుకుందామన్నారు పవన్ కళ్యాణ్.