పార్లమెంటు ఎంపీగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ నియాజకవర్గం సీటుకు ఖాళీ ఏర్పడింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తారా? అయితే.. ఎప్పుడు..? అనే చర్చ తెరమీదకు వచ్చింది.
తెలంగాణలో వచ్చేసారి ఎలక్షన్స్ లో చేస్తా.. ఏపీలో నేను పోటీ చేయకపోవడం వల్లే టీడీపీ గెలిచిందన్న కేఏ పాల్.. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను పోటీ చేయకపోవడం వల్లే అక్కడ టీడీపీ పార్టీ గెలిచిందని కేఏ పాల్ వెల్లడించారు.
ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున సచిన్ పైలట్‌తో విభేదాల చర్చలను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శనివారం తోసిపుచ్చారు. అయితే అన్నీ పార్టీల మాదిరాగానే కాంగ్రెస్‌లో చిన్న చిన్న విభేదాలు ఉంటాయని ఆయన అన్నారు.
పాకిస్థాన్‌లోని వివిధ హైకోర్టుల ఆదేశాల మేరకు పీటీఐ చట్టసభ సభ్యులు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన 37 పార్లమెంట్ స్థానాలకు ఆదివారం పాకిస్థాన్ అత్యున్నత ఎన్నికల సంఘం ఎన్నికలను నిలిపివేసింది.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు, సాగర్దిఘి ఉపఎన్నికల్లో విజయం సాధించలేకపోయిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. తమ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పొత్తు లేకుండా పోటీ చేస్తుందని చెప్పారు.