EC Officers: త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికారులు వివిధ పనులను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల సంఘంలో పలువురు అధికారులను మార్చి కొత్త నియామకాలు చేపట్టారు.
బెంగాల్ లో జరిగిన పంచాయితీ ఎన్నికలలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో అక్కడ అనేక పాఠశాలలు ఘోరమైన నష్టాన్ని చవిచూశాయి. కొన్ని పాఠశాలల తలుపులు, కిటికీలు విరిగిపోయాయి. మరికొన్ని తరగతి గదుల టేబుల్‌లు, కుర్చీలు విరిగిపోయాయి.
ఎన్నికలకు ముందు ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ అనేక కుట్రలు చేస్తుందని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఆరోపించారు. అందుకోసమే.. ఇతర పార్టీల్లో చీలికలు సృష్టిస్తోంది.. యూనిఫాం సివిల్ కోడ్ వంటి అంశాలను తెరపైకి తీసుకువస్తుందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో సొంతంగా గెలుస్తామనే నమ్మకం లేనందునే అలా చేస్తోందని ఉద్ధవ్ థాక్రే విమర్శించారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉద్దవ్ థాక్రే బీజేపీతో సంబంధాలు తెంచుకుని ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కలిసి మహా వికాస్…
ఛత్తీస్‌గఢ్‌లో 2018లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోవడానికి ముందు 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ.. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం మేనిఫెస్టోను రూపొందించేందుకు 31 మంది సభ్యులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.
వరంగల్ లోని బీజేపీ నిర్వహించిన సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఈ సభలో మోడీ పచ్చి అబద్ధాలు మాట్లాడారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్సలు తెలంగాణ ఉద్యమంలో మోడీ పాత్ర ఎంటి..?, మోడీయే విశ్వాస ఘతకుడు.. ద్రోహి అద్వానీ, వెంకయ్య నాయుడులను అతను తొక్కి వేశారు అంటూ ఆరోపించారు.
శనివారం బెంగాల్లో జరుగుతున్న పంచాయత్ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు బ్యాలెట్లతో జరగాలని.. ..బుల్లెట్లతో కాదని అన్నారు.
ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ శుక్రవారం ఎన్నికల ఇన్ఛార్జ్లను ప్రకటించింది. వచ్చే ఏడాది అన్నింటికంటే ముఖ్యమైన లోక్‌సభ ఎన్నికలకు కూడా వారే ఇన్‌ఛార్జులుగా వ్యవహరిస్తారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో మతపరమైన ఘర్షణలను సృష్టించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజల్ని ఆయన కన్ఫ్యూజ్ చేస్తున్నారని మండిపడ్డారు.
మూడు రాష్ట్రాల్లోని 10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్లో అత్యధిక స్థానాలు ఆరు ఉండగా.. గుజరాత్లో మూడు స్థానాలు, గోవాలో ఒకటి ఉన్నాయి.