ఆపరేషన్‌కు సాయం చేయమని అడగడానికి ఒక రైతు తన నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లాడు. తానే డాక్టర్ కావడంతో.. తను ఆర్థిక సాయం చేయడం కంటే.. తానే స్వయంగా ఆపరేషన్ చేసి సమస్యను పరిష్కారం చేయాలని భావించాడు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి.. ప్రధాన మంత్రి కావడం చాలా కష్టం. అలాంటిది ముఖ్యమంత్రి అయిన తరువాత సుదీర్ఘంగా కొనసాగడం ఇంకా కష్టం. కానీ ఏకంగా 5 పర్యాయాలు సీఎంగా కొనసాగుతూ రికార్డు సృష్టించిన వ్యక్తులు అరుదుగా ఉంటారు.
కలలో కూడా ఊహించలేదు.. దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని, తాను 3 సార్లు ఎమ్మెల్యే అవుతానని, కేంద్ర మంత్రి అవుతానని అనుకోలేదు.. ఏం ఆశించకుండా పార్టీ కోసం పనిచేశాను-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యుద్ధమంటూ జరిగితే.. కత్తికి కూడా కనికరం ఉంటుందేమో.. కానీ, తెలంగాణ ప్రజలకు కనికరం ఉండదు.. బండి సంజయ్ ఉన్నప్పుడే యుద్ధం ప్రారంభమైంది.. ఇంకా ముందుంది ముసళ్ల పండుగ-కిషన్‌రెడ్డి
భారతీయ జనతా పార్టీ, విపక్ష పార్టీలు కానీ ప్రజల సంక్షేమం కోసం పని చేయడం లేదని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి అన్నారు. దళితులు, ముస్లింలు, మైనార్టీల కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏం చేయలేదని ఆమె అన్నారు. ఆ రెండు పార్టీలు ఒక్కటే.. అధికారంలోకి రాగానే.. వాళ్లు ఇచ్చిన వాగ్థానాలను మరిచిపోతారని బీఎస్పీ చీఫ్ ఆరోపించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభ్యర్థన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకారం తెలిపింది. కేసును విచారించేందుకు ఈ నెల 21న లిస్ట్ చేసింది.