ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని నిలిపివేయాలని, రాబోయే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌లను ఉపయోగించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వం రద్దయింది. అక్రమ మైనింగ్ కేసులో సోరెన్‌పై వచ్చిన ఆరోపణలు నిజమని నిర్ధారణ కావడంతో ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం జార్ఖండ్ గవర్నర్ రమేశ్ బయాస్‌కు సిఫారసు చేసింది. శుక్రవారం సోరెన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Jharkhand CM Hemant Soren: జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నేత, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ కు షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. తనకు తాను మైనింగ్ లీజును పొడగించడం ద్వారా ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించినందుకు ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ చేసిన అభ్యర్థనపై ఎన్నికల సంఘం తన అభిప్రాయాన్ని జార్ఖండ్ గవర్నర్ రమేష్ బైస్ కు పంపింది. ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని సీల్డ్ కవర్ లో పంపినట్లు…
శివసేన పార్టీ చీలిక నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది.
మనదేశంలో ఓటర్ జాబితా పేరు నమోదు చేసుకుని ఓటరు కార్డు పొందాలంటే 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిందే. ఇకపై ఓటరు కార్డు దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయస్సుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 17 ఏళ్లుపైబడిన యువత ఓటరు జాబితాలో పేరు నమోదుకు ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది.
ఏపీలోని అధికార పార్టీ వైఎస్సార్సీపీకి శాశ్వత అధ్యక్షుడిగా సీఎం వైఎస్ జగన్‌ని నియమించటం చట్టవిరుద్ధమని సీపీఐ నారాయణ అన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్-29ఏ ప్రకారం ఈ తీర్మానం చెల్లదని చెప్పారు. ఈ మేరకు ఆయన నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఉన్న ఏ రాజకీయ పార్టీలో అయినా అంతర్గ ప్రజాస్వామ్యం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఓట్ల ప్రక్రియ ద్వారానే అధ్యక్షుడు సహా మొత్తం కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని తెలిపారు. నిబంధనలు కూడా…
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది భారతీయ జనతా పార్టీ.. ఆత్మకూరు ఉప ఎన్నికలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు.. వైసీపీ కార్యకర్తల్లా వాలంటీర్లు కరపత్రాలను పంపిణీ చేస్తున్నారని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.. Read…
రాష్ట్రపతి ఎన్నికకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ ప్రారంభం రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ సైతం ప్రారంభం కానుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 29 చివరి తేదీ కాగా.. జూలై 18న ఓటింగ్, జూలై 21న ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నిక ప్రక్రియ మొత్తం జూలై 24నాటికి పూర్తికానుంది. ఇదిలా ఉంటే.. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. బీజేపీకి పోటీగా ప్రతిపక్షాల తరఫున దీటైన ఉమ్మడి…
పాకిస్థాన్లో రాజకీయ సంక్షోభం మరింత కాలం కొనసాగేలా కనిపిస్తోంది. ముఖ్యంగా అక్కడి జాతీయ అసెంబ్లీని… రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్ చేస్తోన్న ప్రయత్నాలు సాఫీగా సాగేటట్లు కనిపించడం లేదు. ఇప్పటికే ఈ అంశంపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతుండగా.. వచ్చే మూడు నెలల్లో ఎన్నికలు జరుపుతామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇమ్రాన్ ఖాన్ చెప్పినట్లుగా వచ్చే 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమేనని పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ చెబుతోంది. ముఖ్యంగా న్యాయపరమైన, రాజ్యాంగ…
ఏపీలో మరోసారి ఎన్నికల సందడి కనిపించబోతోంది. ఈ మేరకు ఏపీలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్సీ కరీమున్నీసా స్థానాన్ని భర్తీ చేయాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. దీంతో తాజాగా ఎన్నికల షెడ్యూల్ జారీ చేసింది. మార్చి 24న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. అదే రోజున కౌంటింగ్ కూడా నిర్వహిస్తామని తెలిపింది ఈ ఉప ఎన్నికకు…