దేశంలో కీలకమయిన ఎన్నికల సంస్కరణలకు రంగం సిద్ధం అయింది. ఎన్నికల ప్రక్రియ సంస్కరణలకు కీలక సవరణలు చేయాలని కేంద్రం భావిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సులకు ఆమోదం లభించింది. ఓటర్ల జాబితాలను పటిష్టం చేసేందుకు 4 ప్రధాన సంస్కరణలు రానున్నాయి. దొంగ ఓటర్ల పేర్లు) ల బెడదను తొలగించేందుకు సన్నధ్దమౌతున్న కేంద్ర ఎన్నికల సంఘం. ఓటర్ గుర్తింపు కార్డును ఆధార్ కార్డు తో అనుసంధానం చేసుకోనేందుకు వీలు కల్పిస్తూ చట్ట సవరణ కు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.…
తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం నాడు ఎన్నికలు జరగనున్నాయి. వాస్తవానికి స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వచ్చింది. వీటిలో ఇప్పటికే ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు రేపు పోలింగ్ జరుగనుంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు 10 మంది అభ్యర్థులు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో…
ఏ ఎన్నికలు జరిగినా వంద శాతం పోలింగ్ అనేది చాలా అరుదు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్నిసార్లు వంద శాతం పోలింగ్ జరిగిన సందర్భాలు ఉండొచ్చు.. కానీ, ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల్లో ఎప్పుడూ ఇలా జరగలేదు.. రాజకీయ పార్టీలు ఎంత ప్రచారం చేసినా.. ఎన్నికల సంఘం ఎన్ని సూచనలు చేసినా.. పోలింగ్‌కు దూరంగా ఉండేవారు చాలా మందే.. అయితే, ఎన్నికల్లో ఓటు వేయనివారికి ఎన్నికల కమిషన్ జరిమానా విధించేందుకు సిద్ధమైందని.. ఓటు హక్కు వినియోగించుకోని వారి బ్యాంకు…
చిత్తూరు జిల్లా కుప్పంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై రాష్ర్ట ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుందని వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలోఎన్‌ఈసీ ఆదేశాలనుసారం అధికారులు నడవాలి కానీ, డీజీపీ నేతృత్వంలో పోలీసు వ్యవస్థ నడుస్తుందని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచారానికి పోలీసుల అనుమతి అవసరమా అని ఆయన ప్రశ్నించారు. ఎన్‌ఈసీ ఎన్నికల నిబంధనలు ఏమైనా మార్చారా అంటూ ఆయన మండిపడ్డారు.…
తెలంగాణలో 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ షెడ్యూల్‌కు సంబంధించిన పలు వివరాలను వెల్లడించారు. లోకల్ 12 సీట్లకు షెడ్యూల్ ప్రకటన చేయగా.. ఆదిలాబాద్, వరంగల్, మెదక్ నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం లో ఉన్న ఒక్కొక్క సీటు,మహబూబ్ నగర్,రంగారెడ్డి జిల్లా రెండు స్థానాలకు ఎన్నిక జరుగనుంది. నవంబర్ 16న నోటిఫికేషన్, నవంబర్ 23 నామినేషన్ల…
బద్వేల్ నియోజక వర్గం ఉప ఎన్నిక అక్టోబర్ 30న జరిగింది. మంగళవారం ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం అవుతోంది. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధిగా దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య సుధ పోటీలో వున్నారు. ఆమె భారీ మెజారిటీతో గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. బద్వేల్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఈ స్థానం ఎస్సీ రిజర్వ్‌డ్. ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 7 సార్లు, టిడిపి 4 సార్లు, స్వతంత్ర పార్టీ, జనతా,…
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల ముసాయిదాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్ 1న ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం ఏపీలో మొత్తం 4.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1.99 కోట్ల మంది, మహిళలు 2.4 కోట్ల మంది ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 4,041 మంది ట్రాన్స్ జెండర్లు, 67,090 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. అయితే ఏపీలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటం విశేషం. ఏపీ వ్యాప్తంగా…
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలతో చీఫ్ ఎలక్టోరల్ అధికారి శశాంక్ గోయల్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ప్రత్యేక ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై చర్చ జరిగింది. అనంతరం ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించారు. నవంబర్ 1, 2021న ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం తెలంగాణలో 3,08,75,744 మంది ఓటర్లున్నారు. ఈ జాబితాలో పురుషులు 1,52,57,690 మంది, మహిళలు 1,50,97,292 మంది, థర్డ్ జెండర్ 1,683 మంది, సర్వీస్ ఓటర్లు 14,501 మంది, ఎన్నారై…
హుజురాబాద్‌లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌గోయల్ మీడియాకు తెలిపారు. అక్కడక్కడ చెదురు ముదురు ఘటనలు తప్ప ఏం జరగలేదన్నారు. ప్రస్తుతానికి 86.40శాతం పోలింగ్ నమోదు అయిందన్నారు. 220,223,224,237 పోలింగ్ బూతులో ఇంకా పోలింగ్ శాతం లెక్కించలేదు. సాయంత్రం 7 గంటల వరకు చాలా చోట్ల పోలింగ్ ముగిసింది. 224,237 పోలింగ్ కేంద్రాల్లో ఇంకా ఓటర్లు ఉన్నారు. పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు చాలా బాగా చేశారు.…
హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది.. అధికార పక్షం టీఆర్ఎస్పై ఓవైపు బీజేపీ ఫిర్యాదులు అందిస్తుంటే.. మరోవైపు.. బీజేపీ గీత దాటుతోంది ఇవిగో ఆధారాలంటూ టీఆర్ఎస్ పార్టీ నేతలు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. ఇక, ఇవాళ బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు.. 31-హుజూరాబాద్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ నేతలు.. రఘునందన్ రావు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేశారని..…