Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలు కొంత కాలంగా ఎదురుచూస్తోన్న మునుగోడు ఉప ఎన్నికకు సమయం రానే వచ్చింది.. ఇవాళ మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. ఈ నెల 7వ తేదీ మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు షెడ్యూల్‌లో వెల్లడించిన ఈసీ.. నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరగనున్నట్టు పేర్కొంది. బీహార్‌లోని రెండు స్థానాలకు, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశాలోని ఒక్కో అసెంబ్లీ స్థానంతో పాటు తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి షెడ్యూల్ ప్రకటించి ఈసీ.. ఆ షెడ్యూల్ ప్రకారం… ఈ నెల 7వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా… అక్టోబర్ 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.. 15వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉండగా… నామినేషన్ల ఉపసంహరణకు 17వ తేదీ గడువుగా పెట్టారు.. ఇక, నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనుండగా… నవంబర్ 6వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.. నవంబర్ 8వ తేదీతో ఉప ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగుస్తుందని పేర్కొంది ఈసీ..
Read Also: PM Modi Hyderabad Tour: మరోసారి తెలంగాణకు ప్రధాని మోడీ.. విషయం ఇదే..
Also Read
కాగా, ఇప్పటికే మునుగోడుపై కేంద్రీకరించి పనిచేస్తున్నాయి ప్రధాన పార్టీలు… సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఈ ఎన్నికలు వస్తుండగా… ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. కమలం పార్టీ తీర్థం పుచ్చుకొని.. ఈ సారి పువ్వు గుర్తుపై అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అయ్యారు.. కేంద్ర మంత్రి అమిత్‌షాను పిలిచి భారీ బహిరంగసభ కూడా నిర్వహించారు. మరోవైపు, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీగా గట్టిగానే ప్రయత్నం చేస్తుంది.. ఇప్పటికే తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును ఖరారు చేసి.. విస్తృతంగా ప్రచారంలో మునిగిపోయింది.. పల్లె పల్లెలో కార్యక్రమాలు, పాదయాత్రలు, అగ్రనేతల టూర్లు సాగుతున్నాయి.. మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా అంటూ.. హస్తం పార్టీ కూడా పెద్ద ఎత్తున ప్రజానికంతో బహిరంగ సభ నిర్వహించింది.. ఇక, ఆ రెండు పార్టీలు కాదు.. ఈ సారి విజయం మాదేనంటూ నమ్మకం వ్యక్తం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పటి వరకు తమ అభ్యర్థిని ప్రకటించకపోయినా… మంత్రి జగదీష్ రెడ్డి.. బాధ్యతలను తన బుజాలపై వేసుకుని విస్తృతంగా పర్యటిస్తున్నారు.. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌ను పిలిచి భారీ సభ నిర్వహించినా.. అభ్యర్థిని ప్రకటించలేదు.. ఇక, షెడ్యూల్ విడుదల కావడంతో.. ఏ క్షణంలోనైనా టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?