Voter ID:17 ఏళ్లకే ఓటరు కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈసీ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Voter ID: మనదేశంలో ఓటర్ జాబితా పేరు నమోదు చేసుకుని ఓటరు కార్డు పొందాలంటే 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిందే. ఇకపై ఓటరు కార్డు దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయస్సుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 17 ఏళ్లుపైబడిన యువత ఓటరు జాబితాలో పేరు నమోదుకు ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. ప్రజల్లో అవగాహన కల్పించాలని వెల్లడించింది. ఇప్పటి వరకు జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయస్సు గల వారు మాత్రమే ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా.. తాజాగా ఈసీ తీసుకున్న నిర్ణయంతో 17 ఏళ్ల వారందరికీ అవకాశం లభించినట్లయింది.
జనవరి 1వ తేదీ ఎప్పుడొస్తుందా అని వేచి చూడకుండా 17 ఏళ్ల వయసు దాటిన వారు ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు జాబితాలో యువత పేర్ల నమోదుకు సంబంధించి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్‌తోపాటు ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్రపాండే ఈ నిర్ణయాన్ని వెలువరించారు. ముందస్తు ఓటరు నమోదుకు అవసరమైన సాంకేతికతను అందుబాటులో ఉంచాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు, ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
Command Control Room Live : కమాండ్ కంట్రోల్ రూమ్ సిటీకి మూడో కన్ను కానుందా.?
ఇప్పటివరకు యువత జనవరి నెలలోనే ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉండేది. ఇక నుంచి ఏడాదికి నాలుగు సార్లు అవకాశం ఇచ్చారు. యువత కేవలం జనవరిలోనే కాకుండా ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1వ తేదీల్లో ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ప్రతి త్రైమాసికానికి ఓటరు జాబితాను అప్‌డేట్ చేస్తారు. ప్రతి త్రైమాసికానికి అంటే.. ఇకపై మూడు నెలలకు ఒకసారి ఓటర్ జాబితాను అప్‌డేట్ చేస్తారు. 2023లో జనవరి 1 లేదా ఏప్రిల్ 1 లేదా జులై 1 లేదా అక్టోబర్ 1 నాటికి… 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరు అడ్వాన్స్‌గా ఓటర్ కార్డు కోసం ఇప్పటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఆర్‌పీ యాక్ట్ 1950లోని సెక్షన్ 14బీ, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోర్స్ రూల్స్, 1960 చట్టాల్లో న్యాయశాఖ మార్పులు చేసింది. దరఖాస్తు ఫారాలను కూడా మరింత సులభతరంగా ఎన్నికల సంఘం మార్చనుంది. కొత్త దరఖాస్తు ఫారాలు 2022, ఆగస్టు 1వ తేదీ తర్వాత అందుబాటులోకి రానున్నాయి. అయితే.. ఆలోపు పాత దరఖాస్తుల్లో వివరాలు అందించిన వారికి అనుమతిస్తారు. ఆధార్ సంఖ్యతో ఓటరు కార్డుల అనుసంధాన ప్రక్రియను ఆగస్టు 1 నుంచి ప్రారంభించేందుకు ఈసీ ఇప్పటికే సిద్ధమైంది. దీనికోసం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసిన ఎన్నికల సంఘం.. ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదని.. స్పచ్ఛందం మాత్రమేనని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!