Hemanth Soren: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వం రద్దయింది. అక్రమ మైనింగ్ కేసులో సోరెన్‌పై వచ్చిన ఆరోపణలు నిజమని నిర్ధారణ కావడంతో ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం జార్ఖండ్ గవర్నర్ రమేశ్ బయాస్‌కు సిఫారసు చేసింది. శుక్రవారం సోరెన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద సోరెన్‌పై అనర్హత వేటు వేశారు.
ఈ నేపథ్యంలో జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది జార్ఖండ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై చర్చ మొదలైంది. హేమంత్ సోరెన్ వైదొలిగితే ఆయన సతీమణికి సీఎం పదవి కట్టబెట్టే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ఉదయం సంకీర్ణ ప్రభుత్వ శాసనసభ్యలతో హేమంత్ సోరెన్ సమావేశమై సుదీర్ఘం చర్చించారు. ఆ చర్చల్లో ఏం నిర్ణయించారనే బయటకు తెలియలేదు. ఇదిలావుంటే, హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు పడినా ఆయన మరో ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా గెలిచి, మిత్రపక్ష కూటమి ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే తిరిగి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. అయితే సోరెన్ ఏం చేస్తారన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Ghulam Nabi Azad: మరో పార్టీలో చేరే ప్రసక్తే లేదు.. కొత్త పార్టీ పెడతా!
తనకు తానుగా గనులను కేటాయించుకున్న హేమంత్ సోరెన్‌పై విమర్శలు వెల్లువెత్తిన క్రమంలో సోరెన్ వ్యవహార సరళిపై కేంద్రానికి గవర్నర్ ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదు కేంద్రం ఈసీకి పంపడం, ఈసీ శాసనసభ్యత్వం రద్దుకు సిఫారసు చేయడం, ఈసీ సిఫారసు ఆధారంగా గవర్నర్ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయడం చకాచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని హేమంత్ సోరెన్ ఎలా కాపాడుకుంటారో వేచి చూడాల్సిందే.
హేమంత్ భార్య కల్పన సోరెన్ సీఎం పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని వార్తలు షికారు చేస్తున్నాయి. ఒడిశాలోని మయూర్ భంజ్‌కు చెందిన కల్పన.. వ్యాపార కుటుంబానికి చెందిన మహిళ. ఆమె తల్లి గృహిణి కాగా, తండ్రి వ్యాపారి. 1976లో రాంచీలో కల్పన జన్మించారు. ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం ప్రైవేట్ పాఠశాలలోనే కొనసాగింది. రాంచీలోని ప్రభుత్వ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. 2006, ఫిబ్రవరి 7న హేమంత్ సోరెన్‌ను కల్పన వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె వ్యాపార రంగంలో రాణిస్తూనే ప్రైవేట్ స్కూల్‌ను నడుపుతున్నారు.