Munugode Bypoll : మునుగోడులో ప్రచార పర్వం ముగిసింది. ఈ నెల 3న నిర్వహించే ఉపఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు.
పాక్ మాజీ ప్రధాని, ప్రతిపక్ష పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌కు రాజకీయగా చుక్కెదురైంది. తోషాఖానా కేసులో ఆయనపై పాకిస్తాన్ ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. కానుకల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయ వివరాలను దాచిపెట్టిన కేసులో ఈ మేరకు చర్యలు చేపట్టింది.
Maharastra Politics: శివసేనలో తగదాలతో ఆ పార్టీ గుర్తు అయిన ‘ధనస్సు-బాణం’ కేంద్ర ఎన్నికల సంఘం స్తంభింపచేసింది. మహారాష్ట్రలో శివసేన చీలిక వర్గాలు శివసేన ధనస్సు-బాణం గుర్తు కోసం న్యాయపరమైన పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే అసలైన శివసేన ఎవరికి చెందుతుందో అనే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘమే తేలుస్తుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇదిలా ఉంటే నవంబర్ లో అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికల వస్తుండటంతో ఈ రెండు గ్రూపుల మధ్య గుర్తుల కోసం పంచాయతీ…
మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు జెండా ఎగురవేసి.. అందినకాడికి ఎమ్మెల్యేలను లాక్కెళ్లిన ఏక్నాథ్ సిండే.. ఆ తర్వాత బీజేపీతో చేతులు కలిపి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.. శివసేనలో రెబల్ వర్గంగా కొనసాగుతున్నారు.. తమదే అసలైన శివసేన అంటున్నారు.. అయితే, అంధేరి ఈస్ట్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నేపథ్యంలో.. ఇప్పుడు ఎన్నికల గుర్తులు తెరపైకి వచ్చాయి.. ఇప్పటికే శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం తమ ఆప్షన్లను ఈసీకి సమర్పించింది. మూడు గుర్తులు ఎంచుకుంది.. త్రిశూలం, ఉదయించే సూర్యుడు,…
తూర్పు అంధేరీ ఉపఎన్నికల కోసం శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం మూడు పేర్లు, చిహ్నాలతో కూడిన జాబితాను ఎన్నికల కమిషన్‌కు సమర్పించింది. దీంతో థాకరే వర్గం ఆదివారం నాడు పార్టీకి గుర్తుగా త్రిశూల్, ఉదయిస్తున్న సూర్యుడు, కాగడా గుర్తులను ఎన్నికల కమిషన్‌కు సమర్పించింది.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేలకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. శివసేన గుర్తు అయిన "విల్లు - బాణం"ను ఫ్రీజ్ చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది.
తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలు కొంత కాలంగా ఎదురుచూస్తోన్న మునుగోడు ఉప ఎన్నికకు సమయం రానే వచ్చింది. రేపటి నుంచి మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్లు షురూ కానున్నాయి. అయితే..టీఆర్ఎస్ అభ్యర్థిని ఇంకా ప్రకటించక పోవడం చర్చకు దారితీస్తోంది.
బి.వినోద్ కుమార్ బృందం ఢిల్లీకి వెళ్లి బీఆర్ఎస్ పేరు తీర్మానాన్ని సీఈసీకి అందజేసింది. ఈ తీర్మానాన్ని సమర్పించి, దానికి ఆమోదం తెలపాల్సిందిగా కోరింది.