కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రకటించనుంది. రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి.
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల వేళ భారీగా ప్రలోభాల పర్వం కొనసాగింది.
ఎన్నికల సంఘం పూర్తిగా రాజీపడిందని శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య ఠాక్రే ఆదివారం ఆరోపించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గాన్ని శివసేనగా గుర్తించి దానికి విల్లు, బాణం గుర్తును కేటాయించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో టీచర్, గ్రాడ్యుయేట్, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు, అక్రమాలపై సీఈసీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వైసీపీ నేతలతో పలు చోట్ల ఎన్నికల అధికారులు కుమ్మక్కుతో పెద్ద ఎత్తున బోగస్ ఓట్ల నమోదయ్యాయని అని ఫిర్యాదు చేశారు.
Vote From Home: ఇకపై కొన్ని వర్గాల ప్రజలు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించబోతోంది భారత ఎన్నికల సంఘం. 80 ఏళ్లకు పైబడిని వారు ఇకపై ఇంటి నుంచే ఓటేసే విధంగా నిర్ణయం తీసుకుంది. ఈ పద్ధతిని తొలిసారిగా కర్ణాటక ఎన్నికల్లో తీసుకురాబోతున్నారు. మరికొన్ని రోజుల్లో కర్ణాటక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో 80 ఏళ్లకు పైబడిన వారు, వికలాంగులకు ఇంటి నుంచే ఓటేసే సదుపాయాన్ని ప్రవేశపెట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది.…
నేపాల్ కొత్త అధ్యక్షుడిగా రామ్ చంద్ర పౌడెల్ ఎన్నికయ్యారు. అతను 33 వేల 8 వందల 2 ఎలక్టోరల్ ఓట్లను సాధించగా, అతని ప్రత్యర్థి సుభాష్ చంద్ర నెంబ్వాంగ్ 15 వేల 5 వందల 18 ఎలక్టోరల్ ఓట్లను సాధించినట్లు నేపాల్ ఎన్నికల సంఘం తెలిపింది.
BJP: జాతీయ పార్టీల నిధుల్లో బీజేపీ టాప్ లో నిలిచింది. ఏకంగా సగానికి పైగా నిధులు ఒక్క భారతీయ జనతా పార్టీకే వచ్చాయి. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం.. 2020-21లో అన్ని జాతీయ పార్టీల మొత్తం నిధుల్లో 58 శాతం నిధులు బీజేపీకి వచ్చాయి. 2021-22లో నాలుగు జాతీయ పార్టీలు తమ మొత్తం ఆదాయంలో 55.09 శాతాన్ని ఎలక్టోరల్ బాండ్ల విరాళాల ద్వారా సేకరించాయి.
Election Results: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
శివసేన పార్టీ పేరు, గుర్తును ఏక్‌నాథ్ షిండే వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఉద్దవ్ థాక్రే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.