తెలుగు రాష్ట్రాల్లో టీచర్, గ్రాడ్యుయేట్, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఏపీలో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నెల 16న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడుతారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు మొత్తం ఓటర్లు 10,56,720 మంది ఉండగా.. వారిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లు 10 లక్షల 519 మంది అని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 55,842 మంది ఉన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటర్లు 3,059 మంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మొత్తం 1,538 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Also Read:Antara Motiwala Marwah : బేబీ బంప్‌తో ర్యాంప్ వాక్ చేసిన మోడల్.. నెట్టింట వైరల్
ఉత్తరాంధ్ర పట్టభద్రుల విషయానికి వస్తే ఆరు జిల్లాల్లో 331 పోలీంగ్ కేంద్రాల్లో .. 2 లక్షల 9 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ జిల్లాల్లో గ్రాడ్యుయేట్.. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు పెద్ద సంఖ్యలో సిబ్బందిని నియమించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అనకాపల్లి జిల్లాలో 49,అల్లూరి జిల్లాలో 15,విజయనగరం జిల్లాలో 72, మన్యం జిల్లాలో 24, శ్రీకాకుళం జిల్లాలో 59 పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 16న ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రోజున ఫలితాలను ప్రకటించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read:Bhatti Vikramarka : హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రలో భాగస్వాములు కావాలి
ఇక, తెలంగాణలో ఒక టీచర్, ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 137 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఓటర్ల సంఖ్య 29,720. హైదరాబాద్ జిల్లాలోని 22 పోలింగ్ కేంద్రాల ఎన్నికల నిర్వహణకు 12 మంది సెక్టోరల్ అధికారులను నియమించారు.