Mlc Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు.. సీఈసీకి చంద్రబాబు లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల వేళ భారీగా ప్రలోభాల పర్వం కొనసాగింది. ముఖ్యంగా అధికార పార్టీపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని చోట్ల ఓటుకు ఐదు, ఆరు వేలు ఇచ్చేందుకు కూడా వెనక్కు తగ్గలేదని ప్రచారం ఉంది. కొన్ని చోట్ల డబ్బులు పంచుతుండగానే.. ప్రత్యర్థి పార్టీలు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా.. చర్యలు లేవని ఆరోపణలు ఉన్నాయి. ఓ వైపు ఓటర్ల జాబితాలో అవకతవకలు.. మరోవైపు ప్రలోభాలపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read:Minister Seediri: విశాఖే రాజధాని నో డౌట్.. సీఎం జగన్ గొప్ప పాలసీ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలపై సీఈసీకి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఎన్నికల్లో పలు అక్రమాలను, ఉల్లంఘనలకు వివరించి తక్షణ చర్యలు కోరారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని YSRCP తీవ్రంగా ఉల్లంఘించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. ” రాష్ట్ర మంత్రి శ్రీమతి ఉషా శ్రీచరణ్‌ని డబ్బుల పంపిణీపై క్యాడర్ కు, అధికారులకు సూచనలు ఇస్తున్న వీడియో బయట పడింది. ఓటుకు రూ.1000 పంచాలని స్వయంగా మంత్రి చెప్పారు. ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కి ఎంపీ మిథున్ రెడ్డి కడప క్రాస్ నుండి తంబళ్లపల్లి వరకు ర్యాలీ నిర్వహించారు. 48 గంటల ముందే ప్రచారం నిలిపివేయాల్సి ఉన్నా…ఆ నిబంధనలు ఎంపి ఉల్లంఘించారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలోని వార్డు నెం. 16, బూత్ నంబర్: 232లో వైఎస్‌ఆర్‌సిపి అనుచరుడు ఈశ్వరరావు డబ్బు పంపిణీ చేస్తూ పట్టుబడ్డాడు. తిరుపతి పట్టణంలో 9వ తరగతి విద్యార్హత కలిగిన విజయ అనే మహిళ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అక్రమ ఓటు వేసింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో YSRCP అనుచరులు రమణ మహర్షి స్కూల్ వద్ద డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కారు. తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, అతని కుమారుడు అభినయ్ రెడ్డి, డిప్యూటీ మేయర్ పోలింగ్ బూత్‌లలోకి అక్రమంగా ప్రవేశించారు. పోలింగ్ బూత్ నెం. 233, 233A లలోకి అక్రమగా ప్రవేశించడమే కాకుండా టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు” అని చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
- Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
Also Read:MLC election polling: ప్రశాంతంగా కొనసాగుతున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..
బోగస్ ఓట్లపై ప్రశ్నించిన టీడీపీ నేత దేవనారాయణరెడ్డిని అక్రమంగా పోలీసు కస్టడీలోకి తీసుకున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఒంగోలు పట్టణంలో టీడీపీ టెంట్ వేయడానికి అంగీకరించని పోలీసులు వైసీపీ నాయకులకు మాత్రం అనుమతి ఇచ్చారని తెలిపారు. విశాఖలోని 53వ వార్డు YSRCP కార్పొరేటర్ బర్కత్ అలీ ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తూ వీడియోలో పట్టుబడ్డారని చెప్పారు. బోగస్ ఓటర్లపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకు తిరుపతి పట్టణంలో టీడీపీ నేతలు నర్సింహ యాదవ్, ఇతర నేతలను అరెస్టు చేశారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ బోగస్ ఓట్లకు సహకరించేందుకే పోలీసులు ఈ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. తిరుపతి పట్టణంలో వైసీపీ బోగస్ ఓట్లను ప్రశ్నించిన టీడీపీ నాయకుడు, పోలింగ్ ఏజెంట్ పులిగోరు మురళి ని అక్రమంగా అరెస్టుచేశారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనలకు సంబంధించి ఆధారాలు లేఖతో పాటు చంద్రబాబు పంపించారు.
తాజావార్తలు
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు