ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆయన వ్యాఖ్యలను ప్రాథమికంగా మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు పేర్కొన్న ఎన్నికల సంఘం.. ఆయన వైపు నుంచి ఎటువంటి స్పందన లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. అభ్యర్థులు పోటాపోటిగా ప్రచారం చేస్తున్నారు. ఇక, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ నామినేషన్‌ను ఈసీ ఆమోదించింది.
ఈ ఏడాది రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీ జరగనున్నాయి. ప్రధాన పార్టీ ఇప్పటినుంచే ఎన్నికలపై దృష్టి సారించాయి. కేంద్ర ఎన్నికల సంఘం రాజస్థాన్ ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈసారి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎం-3 ఈవీఎంలతో జరగనున్నాయి.
తమిళనాడులోని అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) కార్యదర్శి పదవికి సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామిని ప్రధాన కార్యదర్శిగా ఎలక్షన్ కమిషన్ అంగీకరించింది. ఈ విషయంలో ఇప్పటికే మద్రాస్ హైకోర్టు సైతం తీర్పు వెలువరించింది.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మద్యం, డబ్బు భారీగా పట్టుబడుతోంది. ఎన్నికల్లో ధన ప్రవాహం అడ్డూ అదుపులేకుండా సాగుతోంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పార్టీలు డబ్బును వెదజల్లుతున్నాయి. భారీగా మద్యం సరఫరా చేస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్ లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి భారత ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. టీఎంసీ జాతీయ పార్టీ హోదాను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం ప్రత్యామ్నాయ మార్గంపై దృష్టిపెట్టారు. ఈ విషయంలో న్యాయపరంగా ఎదుర్కోవాలని యోచిస్తోంది.
కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్ లో ఎన్నికల సంఘం బలహీన గిరిజన సమూహాల (PVTGలు) కోసం 40 'జాతి పోలింగ్ స్టేషన్లను' ఏర్పాటు చేస్తుంది. ఈ బూత్ల వేదిక, రూపురేఖలు భిన్నంగా ఉంటాయి.
పార్లమెంటు ఎంపీగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ నియాజకవర్గం సీటుకు ఖాళీ ఏర్పడింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తారా? అనే అంశం చర్చకు వచ్చింది.
పార్లమెంటు ఎంపీగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ నియాజకవర్గం సీటుకు ఖాళీ ఏర్పడింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తారా? అయితే.. ఎప్పుడు..? అనే చర్చ తెరమీదకు వచ్చింది.