Aaditya Thackeray: ఎన్నికల సంఘం పూర్తిగా రాజీపడింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aaditya Thackeray: ఎన్నికల సంఘం పూర్తిగా రాజీపడిందని శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య ఠాక్రే ఆదివారం ఆరోపించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గాన్ని శివసేనగా గుర్తించి దానికి విల్లు, బాణం గుర్తును కేటాయించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో సీఎం అంటే కరెప్ట్‌మ్యాన్(అవినీతిపరుడు)గా మారిందని ఎద్దేవా చేశారు. అక్రమ, రాజ్యాంగ విరుద్ధమైన ముఖ్యమంత్రి తప్పకుండా వెళ్లాల్సిందేనన్నారు.
ఉత్తర ముంబైలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో థాకరే మాట్లాడుతూ.. శివసేన (యూబీటీ)కి కేటాయించిన మండుతున్న టార్చ్ (మషాల్) గుర్తు మాత్రమే ద్రోహం, వెన్నుపోటు కారణంగా ఏర్పడిన చీకటిని ప్రకాశవంతం చేస్తుందని అన్నారు. కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో, తుపాను, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల కష్టాలను తీర్చే పనిలో ప్రభుత్వం నిమగ్నమైతే.. ప్రభుత్వాన్ని కూల్చివేసే పనిలో షిండే నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు పని చేశారని ఆయన అన్నారు. మహా వికాస్ అఘాడి ప్రభుత్వం మహారాష్ట్రను స్వర్ణయుగానికి తీసుకెళ్తోందని మాజీ మంత్రి అన్నారు. రెండున్నరేళ్ల ఎంవీఏ హయాంలో రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 93 శాతం పెట్టుబడి ప్రతిపాదనలు అమలు చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టడం తప్పా .. బీజేపీ చేసిందేముందని ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు.
Also Read
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
Read Also: Potatoes Export: ఆగ్రా నుంచి మలేషియా, ఖతార్, దుబాయ్‌లకు 6,000 క్వింటాళ్ల బంగాళదుంపలు
రైతులకు రుణమాఫీ చేయడం ఎంవీఏ ప్రభుత్వం చేసిన అతి ముఖ్యమైన పని అన్నారు. మహారాష్ట్రకు ద్రోహాలు ఇష్టం లేదని, గడువు ముగిసినా స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడానికి ఇదే కారణమని అని వర్లి ఎమ్మెల్యే అన్నారు. ఎంవీఏ పాలనలో మహారాష్ట్ర ఆకర్షించిన పెట్టుబడులను గుజరాత్‌కు (ఏక్‌నాథ్ షిండే-బీజేపీ హయాంలో) తరలించారని ఆయన అన్నారు. ముంబై నగరపాలక ఎన్నికలు ఎప్పుడు జరిగినా శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. షిండే శిబిరంలోకి ఫిరాయించిన 40 మంది ఎమ్మెల్యేలలో ఎవరూ తాము డబ్బు తీసుకోలేదని స్పష్టంగా చెప్పలేదని ఆదిత్య ఠాక్రే చెప్పారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ విధేయతలను షిండే శిబిరానికి మార్చుకోవడంలో డబ్బు మార్పిడి జరిగిందని ఠాక్రే శిబిరం ఆరోపించింది.
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!