TS Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. బీఆర్‌ఎస్ ఇప్పటికే 115 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం తహశీల్దార్లను ఇతర జిల్లాలకు బదిలీ చేస్తూ రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఇవాళ (మంగళవారం) ఉత్తర్వులు జారీ చేశారు.
EC Officers: త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికారులు వివిధ పనులను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల సంఘంలో పలువురు అధికారులను మార్చి కొత్త నియామకాలు చేపట్టారు.
రాజకీయ పార్టీలు ఇకపై తమ ఆడిట్‌రిపోర్ట్ లను భారత ఎన్నికల కమిషన్‌కు ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. నేరుగా ఈసీఐ వెళ్లి సమర్పించాల్సిన అవసరం లేకుండా తమ ఆడిట్ రిపోర్టులను ఆన్‌లైన్‌లో సమర్పించడానికి అవకాశం కల్పించింది.
కర్ణాటకలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఉప ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఉప ఎన్నికలు జూన్ 30న జరుగుతాయని తెలిపింది.
Janasena: ఏపీలో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ ఝలక్ ఇచ్చింది. ఆ పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను ఈసీ తాజాగా వెల్లడించింది.