Wayanad By-Election: వయనాడ్ ఉపఎన్నికపై ఉత్కంఠ.. కర్ణాటకతో పాటు ఈసీ షెడ్యూల్ ప్రకటిస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wayanad By-Election: పార్లమెంటు ఎంపీగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ నియాజకవర్గం సీటుకు ఖాళీ ఏర్పడింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తారా? అయితే.. ఎప్పుడు..? అనే చర్చ తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం వయనాడ్‌లో ఉపఎన్నికను నిర్వహిస్తారనే వార్తల నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. సెప్టెంబర్‌లో ఇక్కడ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. కాగా భారత ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. రాహుల్ పరిణామంపై ఈసీ ఇంతవరకు స్పందించలేదు. ఇదిలా ఉండగా.. కర్ణాటక ఎన్నికల షెడ్యూల్‌తో పాటు వయనాడ్ ఉపఎన్నికకు ఈసీ షెడ్యూల్ ప్రకటిస్తుందా అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
రాహుల్‌పై అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన వయనాడ్ లోక్‌సభ సీటుకు ప్రజాప్రాతినిధ్యం చట్టం-2015లోని సెక్షన్ 151ఏ కింద ఆరు నెలల్లోపు ఉపఎన్నిక జరపాల్సి ఉంటుంది. దోషిగా నిరూపణపై కనీసం రెండేళ్ల పాటు శిక్ష పడిన ఎంపీ ఎవరైనా సరే అనర్హత వేటుకు అర్హుడని సెక్షన్ 8(3) చెబుతోంది. ఇదే సెక్షన్ కింద రాహుల్‌పై లోక్‌సభ సెక్రటేరియట్ శుక్రవారం నాడు అనర్హత వేటు వేసింది. దీంతో ఉపఎన్నిక తేదీని ప్రకటించే బాధ్యత ఇప్పుడు ఎన్నికల సంఘంపై ఉంది. లోక్‌సభలో ప్రస్తుతం రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. ఒకటి జలంధర్ కాగా, మరొకటి వయనాడ్. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి గుజరాత్‌లోని సూరత్ హైకోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 కింద లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్ ఎంపీ సభ్యత్వంపై అనర్హత వేటు వేసింది. సూరత్ కోర్టు తన తీర్పును పైకోర్టులో సవాలు చేసుకునేందుకు రాహుల్‌కు 30 రోజుల సమయం ఇచ్చింది. రాహుల్ అభ్యర్థనపై వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ కూడా మంజురు చేసింది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
Read Also: Karnataka Elections: నేడు కర్ణాటకలో మోగనున్న ఎన్నికల నగారా!
రాహుల్ గాంధీ 2019లో అమేథీతో పాటు వయనాడ్‌కు పోటీ చేసిన సంగతి తెలిసిందే. అమేథీలో ఆయన ఓటమి చవిచూశారు. వయనాడ్‌లో గెలుపొందారు. ప్రస్తుతం పరువునష్టం కేసులో రెండేళ్ల జైలుశిక్ష పడటంతో సూరత్ కోర్టు తీర్పును సెషన్స్ కోర్టులో రాహుల్ సవాలు చేయనున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పైకోర్టు స్టే ఇవ్వకుంటే 8 ఏళ్ల పాటు పోటీ చేసే ఛాన్స్‌ను రాహుల్ గాంధీ కోల్పోతారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..