Maharashtra: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చి వారం గడిచింది. బీజేపీ నేతృత్వంలోని ఏక్ నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీల ‘‘మహాయుతి’’ కూటమి ఘన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాల్లో 233 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ ఒంటరిగా 132 స్థానాలు సాధించి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయితే, మహాయుతి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ముఖ్యమంత్రి విషయంలో మహారాజకీయాల్లో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో రెండు రోజుల క్రితం షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ భేటీ అయ్యారు. దీని తర్వాత ఏదైనా ప్రకటన వస్తుందని ఊహించినప్పటికీ అలాటిదేం జరగలేదు. ఏక్‌నాథ్ షిండే సీఎం పదవి గట్టిగా కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దేవేంద్ర ఫడ్నవీస్‌కి సీఎం పోస్ట్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది.
Read Also: Real Estate: హైదరాబాద్‌లో వరుసగా మూతపడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థలు
ఇదిలా ఉంటే, బీజేపీ సీఎం పోస్టుతో పాటు హోం మినిస్ట్రీ కూడా తన వద్దే ఉంచుకోవాలని భావిస్తోంది. ఇప్పుడు ఇదే బీజేపీ-శివసేన మధ్య పంచాయతీకి దారి తీసింది. శివసేన నేత సంజయ్ శిర్సత్, కొత్త ప్రభుత్వంలో తమ పార్టీ హోంశాఖ కావాలని కోరాడు. “హోం శాఖ పార్టీ (శివసేన) వద్ద ఉండాలి. ఈ శాఖకు సాధారణంగా ఉప ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తారు, అయితే ముఖ్యమంత్రి దానిని కూడా నిర్వహించడం సరికాదు” అని ఔరంగాబాద్ పశ్చిమ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న శిర్సత్ అన్నారు. మరాఠా కోటా ఉద్యమాన్ని షిండే పరిష్కరించాలని ఆయన చెప్పారు. లడ్కీ బహిన్ పథకాన్ని, ఇతర సంక్షేమ చర్యల్ని ఆయన హైలెట్ చేశారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో 288 స్థానాలకు గాను 230 సీట్లని మహాయుతి గెలుచుకుంది. బీజేపీ 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, 57 స్థానాలను శివసేన గెలుచుకుంది, ఎన్సీపీ 41 స్థానాల్లో విజయం సాధించింది.